News December 29, 2025
పెద్దపల్లి: 8 పాఠశాలలకు జిల్లా స్థాయి అవార్డులు

పెద్దపల్లి జిల్లాలో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 8 పాఠశాలలకు జిల్లా స్థాయి స్వచ్ఛ పాఠశాల అవార్డులు అందజేశారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్ష అవార్డులు, ప్రశంస పత్రాలు పంపిణీ చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, పరిశుభ్రత, హైజిన్, మిషన్ లైఫ్ అంశాలను లెక్కించి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంతో విద్యార్థుల్లో ఆరోగ్యం, పర్యావరణ అవగాహన పెరిగిందని పేర్కొన్నారు.
Similar News
News February 16, 2026
28,740 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే ఆఖరు

పోస్టాఫీసుల్లో 28,740 బీపీఎం, GDS, ఏబీపీఎం ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లు 5PM వరకు అప్లై చేసేందుకు అవకాశం ఉంది. APలో 1,060, TGలో 608 పోస్టులు ఉన్నాయి. టెన్త్ పాసై, 18-40 ఏళ్ల వయసున్న వారు అర్హులు. టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎగ్జామ్ ఉండదు. పోస్టును బట్టి రూ.10వేల నుంచి రూ.29,380గా శాలరీ ఉంది.
సైట్: https://indiapostgdsonline.gov.in/
News February 16, 2026
NGKL: నల్లమలలో సేవాలాల్ పుణ్యక్షేత్రం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా అద్భుత క్షేత్రాన్ని నిర్మించి, వచ్చే ఏడాది జయంతి ఉత్సవాలను అక్కడే నిర్వహిస్తామన్నారు. ఈ నిర్ణయంపై జిల్లా గిరిజన నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
News February 16, 2026
నేడు అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన

AP: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ నేడు అమరావతికి రానున్నారు. సచివాలయంలో CM చంద్రబాబు, DyCM పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌తో ఆయన భేటీ కానున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కొనసాగుతున్న విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల ప్రాజెక్టులను విస్తరించడంపై చర్చలు జరపనున్నారని సమాచారం. రియల్‌టైమ్ గవర్నెన్స్ సెంటర్, సంజీవని ప్రాజెక్ట్, టెక్నాలజీ ఆధారిత వ్యవసాయ విధానాలను ఆయన పరిశీలించనున్నారు.


