News November 11, 2025
పెద్దపల్లి BC JAC వైస్ ఛైర్మన్‌గా కొండి సతీష్

PDPL బీసీ JAC వైస్ ఛైర్మన్‌గా తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక విశ్లేషకుడు కొండి సతీష్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర BC JAC ఆదేశాల మేరకు జిల్లా ఛైర్మన్ దాసరి ఉషా ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా కొండి సతీష్ మాట్లాడుతూ.. BCలకు రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. BCల ఐక్యత, కులవృత్తుల అభివృద్ధి, రాజకీయ శక్తివర్ధన దిశగా BC JAC కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
Similar News
News November 11, 2025
నంద్యాల విద్యార్థినికి వైఎస్ జగన్ రూ.లక్ష ప్రోత్సాహకం

SSC-2025లో రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించిన నంద్యాల విద్యార్థిని షేక్ ఇష్రత్ (599/600) మంగళవారం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా జగన్ ఆమెను అభినందించి, రూ.లక్ష ప్రోత్సాహకం ప్రకటించారు. మహిళలు చదువుకుంటేనే సమాజంలో గౌరవం లభిస్తుందని, ఉన్నత లక్ష్యంతో చదవాలని జగన్ ఇష్రత్‌కు సూచించారు.
News November 11, 2025
బిహార్.. ఎన్డీఏదే గెలుపు!

* Matrize exit poll: ఎన్డీఏ 147-167, ఎంజీబీ 70-90
* People’s Insight: ఎన్డీఏ 133-148, ఎంజీబీ 87-102
* చాణక్య స్ట్రాటజీస్: ఎన్డీఏ 130-138, ఎంజీబీ 100-108
* POLSTRAT:ఎన్డీఏ 133-148, ఎంజీబీ 87-102
*CNN న్యూస్ 18: ఫస్ట్ ఫేజ్ (121)లో ఎన్డీఏ 60-70, ఎంజీబీ 45-55
* JVC EXIT POLL: ఎన్డీఏ 135-150, ఎంజీబీ 88-103
News November 11, 2025
మంచిర్యాల: వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు: కలెక్టర్

వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో ‘అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం- 2025’ గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 12 నుంచి 19 వరకు వృద్ధుల వారోత్సవాలు కొనసాగుతాయన్నారు. పోషణ, ఇతర ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నం.14567ను వృద్ధులు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.


