News March 4, 2025
పెద్దపల్లి: LRS ఫీజులపై 25% మినహాయింపు: కమిషనర్

పెద్దపల్లి పట్టణ ప్రజలు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (LRS) పరిధిలో ఫీజులు మార్చి 31లోపు చెల్లిస్తే 25% మినహాయింపు పొందవచ్చని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వం అందించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ ఆస్తులను రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులోపు ఫీజులు చెల్లించి ప్రయోజనం పొందాలని కమిషనర్ కోరారు.
Similar News
News July 10, 2025
400 రన్స్ చేసే అవకాశాలు మళ్లీ మళ్లీ రావు: గేల్

SA కెప్టెన్ ముల్డర్ ఇటీవల టెస్టులో 400రన్స్ చేసే అవకాశం ఉన్నా వద్దనుకోవడం చర్చనీయాంశమైంది. దీనిపై WI క్రికెట్ దిగ్గజం గేల్ స్పందించారు. ఇటువంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావన్నారు. ఛాన్స్ దొరికినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తనకు ఇటువంటి అవకాశమొస్తే వదలనని చెప్పారు. లారా(400*) రికార్డును అధిగమించే ఉద్దేశం లేకే 367* స్కోర్ వద్ద డిక్లేర్ చేసినట్లు ముల్డర్ వెల్లడించిన విషయం తెలిసిందే.
News July 10, 2025
మంచిర్యాల జిల్లా అధికారులతో DPO సమావేశం

జిల్లా పంచాయతీ అధికారి D.వెంకటేశ్వరరావు అధ్యక్షతన డివిజన్ పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లేఅవుట్, గృహ నిర్మాణ అనుమతులు, మ్యుటేషన్, ట్రేడ్ లైసెన్స్‌కు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించాలన్నారు. ప్లాంటేషన్, గ్రామపంచాయతీల తనిఖీలు, ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లాన్, పంచాయతీ కార్యదర్శుల అటెండెన్స్, DSR గురించి సమీక్షించారు.
News July 10, 2025
కల్తీ కల్లు ఘటనలో బాధితుల వివరాలు

బాలానగర్ ఎక్సైజ్ PS పరిధిలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై నిమ్స్‌తో పాటు రాందేవ్రావ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలను విడుదల చేశారు. నిమ్స్‌లో 27 మంది చికిత్స పొందుతుండగా కూకట్‌పల్లిలోని రాందేవ్‌దేవ్‌రావు ఆస్పత్రిలో ఒకరు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. అందరికీ మెరుగైన చికిత్స అందించడంతోపాటు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు.