News February 3, 2025

పెద్దపల్లి: MLC కవితకు ఘన స్వాగతం..

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చిన సందర్భంగా పెద్దపల్లి మండలంలోని పెద్దకాల్వల వద్ద BRS శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా నాయకులు కవితకు పుష్పగుచ్ఛం ఇవ్వగా.. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి బీఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News

News February 3, 2025

సిద్దిపేట: ప్రోమో ఆవిష్కరించిన DMHO

image

ప్రాచీన ఆరోగ్య విధానాలు, యోగాను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మించవచ్చని సిద్దిపేట జిల్లా వైద్య& ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వాన్ కుమార్ అన్నారు. సోమవారం శత సహస్ర సూర్య నమస్కార ప్రదర్శన, రాష్ట్రస్థాయి పోటీలకు సంబంధించి ప్రోమో ఆవిష్కరించారు  భారతీయ ఆరోగ్య విధానాలు ప్రపంచానికి మార్గదర్శకమన్నారు.

News February 3, 2025

HYD: అనుమతి నిరాకరించడంపై మందకృష్ణ ఫైర్

image

లక్ష డప్పులు.. వేయి గొంతులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించడాన్ని ఖండిస్తున్నామని మందకృష్ణ మాదిగ అన్నారు. సోమాజిగూడలో ఆయన మాట్లాడుతూ.. సీఎం, డీజీపీ HYD సిటీ సీపీ పునరాలోచించాలని, పునఃసమీక్ష చేసి అనుమతిని మంజూరు చేయాలన్నారు. MRPS ఏ రోజూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పని చేయలేదని, మాదిగ పల్లెలో కనుమరుగవుతున్న డప్పులు మళ్లీ పునరుజ్జీవం పోసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

News February 3, 2025

నెల్లూరు పోలీస్ గ్రీవెన్స్‌కు 95 ఫిర్యాదులు

image

పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని SP జి. కృష్ణ కాంత్ తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి 95 ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.