News October 17, 2025
పెద్దపల్లి: TASK i4TY 2.0 ఐడియాథాన్‌కు విశేష స్పందన

TASK ఆధ్వర్యంలో ‘i4TY 2.0’ ఫిజికల్ ఐడియాథాన్ పెద్దపల్లి TASK రీజినల్ సెంటర్‌లో శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. ‘వోకల్ ఫర్ లోకల్’ థీమ్‌పై 3 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 210 మంది విద్యార్థులు 45 ఆవిష్కరణలు ప్రదర్శించారు. స్థానిక సమస్యలకు వినూత్న పరిష్కారాలు, డిజిటల్ ఐడియాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ఆలోచనలకు మెంటర్‌షిప్, ఇంక్యుబేషన్ సపోర్ట్ అందించనున్నట్లు TASK ప్రతినిధులు తెలిపారు.
Similar News
News October 18, 2025
ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు

AP: రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 10,700 మంది సిబ్బందితో సన్నాహాలు చేస్తున్నాం. 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మిల్లర్లు పనిచేయాలి. ధాన్యం 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం’ అని తెలిపారు.
News October 18, 2025
నేడు మద్యం, మాంసం వద్దు! ఎందుకంటే..?

ధన త్రయోదశి పర్వ దినాన మాంసం, మద్యం వంటి తామసిక ఆహారాన్ని తీసుకోకూడదని పండితులు సూచిస్తున్నారు. లేకపోతే లక్ష్మీ కటాక్షం కలగదని అంటున్నారు. ‘నలుపు రంగు వస్తువులు కొనుగోలు చేయకూడదు. గృహోపకరణాలు దానం చేయడం, అమ్మడం వంటివి చేయకండి. నేడు ఎవరికీ రుణం ఇవ్వకూడదు. ఇంట్లో ఏ మూలనా చీకటి లేకుండా, ప్రతి చోట పరిశుభ్రత, దీపాల వెలుగు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది’ అని సూచిస్తున్నారు.
News October 18, 2025
మంచిర్యాల: ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన

మంచిర్యాల జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన కనిపించింది. జిల్లాలోని ఏర్పాటుచేసిన పలు కేంద్రాల వద్ద శుక్రవారం 433 దరఖాస్తులు వచ్చినట్లుగా జిల్లా అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మంచిర్యాలలో 263, బెల్లంపల్లి 185, లక్షెట్టిపేట 109, చెన్నూరు 98, మొత్తంగా 655 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.