News March 31, 2025

పెద్దమ్మ తల్లి బోనమెత్తిన మంత్రి కొండా సురేఖ

image

పెద్దమ్మ తల్లి దీవెనలతో ప్రజలందరు బాగుండాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఖిలా వరంగల్ తూర్పు కోట పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఉగాది పండుగ సందర్భంగా జరిగే జాతరలో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిధులుగా పాల్గొని ఎడ్ల బండిపై గుడి చుట్టూ ప్రదర్శన చేశారు. అనంతరం పెద్దమ్మ తల్లికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు.

Similar News

News April 1, 2025

రేపు వరంగల్ మార్కెట్ పునః ప్రారంభం

image

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ బుధవారం పునః ప్రారంభం కానుంది. శనివారం అమావాస్య, ఆదివారం వారాంతపు సెలవు, సోమవారం మంగళవారం రంజాన్ సందర్భంగా సెలవు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News April 1, 2025

ఆందోళనలో ‘మావో’ కుటుంబాలు

image

ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతలు నేలకొరుగుతున్నారు. ఇక్కడి నుంచి సుమారు 21 మంది కీలక నేతలు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నట్లు ఇప్పటికే కేంద్ర హోంశాఖ వివరాలు ఆరా తీసినట్లు తెలిసింది. ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న ఎన్ కౌంటర్లతో జిల్లాలోని వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఓరుగల్లు వాసులే ఉండడం గమనార్హం.

News April 1, 2025

స్టేషన్‌ఘన్‌పూర్: ట్రాక్టర్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

image

ట్రాక్టర్ కొనివ్వలేదని ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సముద్రాల గ్రామానికి చెందిన బోధాసి సంతోష్ ట్రాక్టర్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులను ట్రాక్టర్ కొనివ్వమని అడగగా.. ఇప్పుడు డబ్బులు లేవు కొన్ని రోజుల తర్వాత కొనిస్తామన్నారు. దీంతో క్షణికావేశంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

error: Content is protected !!