News February 3, 2026
పెద్దల ఆశీర్వాదాలతో ఫలితం ఉంటుందా?

పెద్దల ఆశీర్వచనాలు/దీవెనలు మాటవరసకు చెప్పేవి కావని, అవి తప్పక ఫలిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. సన్మార్గంలో నడిచేవారికి సత్పురుషులు, పండితులు ఇచ్చే దీవెనల వల్ల జాతక దోషాలు, అకాల మృత్యు భయాలు తొలగిపోతాయని చెబుతున్నాయి. పూర్వజన్మ పాపాలు కూడా నాశనమవుతాయట. గురువులు, యోగులు, పండితులు వయసులో చిన్నవారైనా, వారిలోని విద్వత్తుకు, ఆధ్యాత్మిక శక్తికి గౌరవమిస్తూ పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకోవాలి.
Similar News
News February 17, 2026
ఒత్తిడే అసలు శత్రువు!

మానసిక ఒత్తిడి గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘మనం ఒత్తిడికి గురైనప్పుడు మెదడులోని నాడీ వ్యవస్థ వేగంగా స్పందిస్తుంది. దీనివల్ల BP, హార్ట్ బీట్ పెరగడమే కాకుండా రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఇది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచి చివరికి గుండెపోటుకు దారితీస్తుంది. గుండె ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం వంటి పద్ధతుల ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి’అని సూచిస్తున్నారు.
News February 17, 2026
మహిళలకు గుడ్‌న్యూస్.. రెండు కొత్త పథకాలు

AP: మహిళా దినోత్సవం(మార్చి 8) రోజున డ్వాక్రా మహిళా సంఘాల సభ్యుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణలక్ష్మి పథకాలను ప్రారంభించనుంది. ‘కళ్యాణ లక్ష్మి’ కింద పిల్లల వివాహాలకు ₹10వేల నుంచి ₹లక్ష వరకు రుణం ఇస్తుంది. 48 వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ‘విద్యాలక్ష్మి’లో పిల్లల చదువుల కోసం ₹10,000-₹లక్ష రుణసాయం అందిస్తుంది. కనీసం 6 నెలలపాటు సభ్యత్వం ఉన్న వారికి ఇది వర్తిస్తుంది.
News February 17, 2026
భారీ జీతంతో SETలో ఉద్యోగాలు

సొసైటీ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అండ్ సెక్యూరిటీ (SETS) 4 సైంటిస్ట్ E, Fపోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BE/BTech, MSc(CS, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్), ME/MTech/PhD అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఏప్రిల్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైంటిస్ట్ F పోస్టుకు నెలకు రూ.1.31L-రూ.2.16L, సైంటిస్ట్ E పోస్టుకు రూ. 1.23L-రూ.2.15L చెల్లిస్తారు.


