News February 18, 2025
పెద్దశేష వాహనంపై వైకుంఠ నాథుడి దర్శనం

శ్రీనివాసమంగాపురంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలిరోజు మంగళవారం రాత్రి శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామికి పెద్దశేష వాహన సేవ జరిగింది. వైకుంఠనాథుని అలంకారంలో స్వామివారు దర్శనం ఇచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు. భక్తులు కర్పూర హారతులు పట్టారు.
Similar News
News November 1, 2025
భీమారం: రైతులు ఆందోళన చెందొద్దు: కలెక్టర్

భీమారం మండలం కేంద్రంలో తుఫాన్ కారణంగా కురిసిన అకాల వర్షాలకు నేలకొరిగిన వరి పంటలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. అనంతరం మండలంలోని దేశాయిపేటలో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. మొలకలు వచ్చిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు.
News November 1, 2025
అది చెడు పాలన ఫలితం: అజిత్ దోవల్

చెడు పాలన పరిణామాలతో బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లో ప్రభుత్వాలు మారాయని NSA అజిత్ దోవల్ అన్నారు. ఆర్థిక వైఫల్యాలు, ఆహార కొరత, ద్రవ్యోల్బణం, సామాజిక సంఘర్షణలే వాటి పతనానికి కారణమని పేర్కొన్నారు. దేశాలను నిర్మించడంలో బలమైన పాలన ఎంతో ముఖ్యమని రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో చెప్పారు. దేశంలో టెర్రరిజాన్ని సమర్థంగా ఎదుర్కొన్నామని, J&K తప్ప ఎక్కడా 2013 నుంచి టెర్రర్ అటాక్ జరగలేదని తెలిపారు.
News November 1, 2025
జమ్మికుంట రైల్వే ప్లాట్‌ఫారంపై గుర్తు తెలియని మహిళ మృతి

జమ్మికుంట రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంపై గుర్తు తెలియని 50ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమె బ్రౌన్ నైటీ ధరించి ఉండగా, అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తింపు కార్డులు లభించలేదు. శవాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వివరాలు తెలిసినవారు 9949304574, 8712658604 లకు తెలుపగలరని రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి కోరారు.


