News February 6, 2025
పెద్దాపురం ఎంపీడీవోకు జిల్లా అధ్యక్ష పదవి
ఏపీ పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షురాలిగా పెద్దాపురం ఎంపీడీవో డి.శ్రీలలిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సంఘం కాకినాడ జిల్లా కమిటీ సమావేశం బుధవారం జరిగింది. జిల్లా అధ్యక్షురాలిని ఎన్నుకున్నారు. అనంతరం శ్రీలలితకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News February 6, 2025
NLG: ఇంటర్ ప్రాక్టికల్స్‌కు 357 మంది గైర్హాజరు
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు బుధవారం 357 మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రాక్టికల్స్‌కు మొత్తం 2760 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 2507 మంది హాజరయ్యారు. 253 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ప్రాక్టికల్స్‌కు 1985 మంది హాజరుకావాల్సి ఉండగా 1881 మంది పరీక్ష రాశారు. 104 మంది గైర్హాజరయ్యారు.
News February 6, 2025
కరీంనగర్‌లో రేపు జాబ్ మేళా..!
కరీంనగర్‌లోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(ఆటానమస్)లో శుక్రవారం జాబ్ మేళా జరగనుందని ప్రిన్సిపల్ ప్రొ.డీ.వరలక్ష్మీ తెలిపారు. ఈ ఉద్యోగ మేళా ఉదయం 9గంటలకు ప్రారంభమవుతుందని.. ఈ అవకాశాన్ని స్థానికంగా ఉండే ప్రతి నిరుద్యోగి సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ జాబ్ డ్రైవ్‌లో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఇంటర్వ్యూకి అవసరమయ్యే అన్ని డాక్యుమెంట్స్‌ను వెంట తెచ్చుకోవాలన్నారు.
News February 6, 2025
యాదాద్రి: రైతు భరోసా నిధులు జమ
భువనగిరి జిల్లాలో ఒక ఎకరం లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు జమాయ్యాయి. యాదాద్రి జిల్లాలో మొత్తం 78,795 మంది రైతులకు గాను రూ.46,44,93,195 రూపాయల రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమయ్యాయి. గత ప్రభుత్వం రైతుబంధు ద్వారా ఎకరాకు రూ.5వేలు జమ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఒక ఎకరాకు 6000 రూపాయలను జమ చేస్తోంది.