News January 6, 2025
పెద్దాపురం: లారీ ఢీకొని వ్యక్తి మృతి
పెద్దాపురం ఇండస్ట్రియల్ ప్రాంతంలో సోమవారం లారీ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. సామర్లకోట గణపతి నగరానికి చెందిన పెంకె అప్పారావు బైక్‌పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో స్పాట్‌లోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు అప్పారావు పట్టాభి ఆగ్రో ఫుడ్స్ పరిశ్రమలో పనిచేస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఘటనపై పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 8, 2025
పిఠాపురం: అక్కాచెల్లెళ్లను మోసగించిన వ్యక్తికి 30 ఏళ్లు జైలు శిక్ష
పిఠాపురానికి చెందిన అక్కాచెల్లెళ్లను అదే గ్రామానికి చెందిన హేమంత్ ప్రేమ పేరుతో మోసం చేయడంతో అతడికి 30ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధించింది. ఈ మేరకు కాకినాడ పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి శ్రీదేవి మంగళవారం తీర్పు చెప్పారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒకరికి తెలియకుండా మరొకరిపై రెండేళ్లపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికల తండ్రి ఫిర్యాదుతో 2019లో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
News January 8, 2025
గొల్లప్రోలు: పదో తరగతి విద్యార్థి కత్తితో హల్ చల్
పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి గొల్లప్రోలులో మంగళవారం నడిరోడ్డుపై కత్తితో హల్ చల్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. మండల పరిధిలోని చెందుర్తి గ్రామానికి చెందిన ఆ విద్యార్థి స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. చెందుర్తి గ్రామానికి చెందిన మరో విద్యార్థినిపై దాడి చేసి స్థానికులను కత్తితో బెదిరించాడు. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.
News January 8, 2025
యూరియా కొరత లేకుండా చూడాలి: మంత్రి కందుల
తూర్పుగోదావరి జిల్లాలో రైతులకు యూరియా కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఎరువులను సరఫరా చేయాలని సూచించినట్లు తెలిపారు. జనవరి 10వ తేదీ లోపు 2500 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు రంగం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.