News April 9, 2025

పెద్దాపురం: ల్యాండ్ రీసర్వేపై ఆర్డీవో సమీక్ష

image

ల్యాండ్ రీసర్వేపై పెద్దాపురం ఆర్డీవో కె. శ్రీరమణి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. ‌ఈ సమావేశంలో పెద్దాపురం డివిజన్ పరిధిలోని 11 మండలాల ల్యాండ్‌ రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్లు, మండల సర్వేయర్లు పాల్గొన్నారు. ఆయా మండలాల్లో ల్యాండ్ రీ‌సర్వే జరుగుతున్న తీరుతెన్నుల గురించి చర్చించారు.

Similar News

News September 18, 2025

అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం తీసుకోవాలి: కలెక్టర్

image

గర్భిణులు, బాలింతలు ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లోనే భుజించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ స్పష్టం చేశారు. ఆమె తన ఛాంబర్‌లో ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ మాసంలో కార్యక్రమాలను ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

News September 18, 2025

VZM: ‘యూరియా కొరతపై సోషల్ మీడియాలో అసత్య వార్తలు’

image

విజయనగరం జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. సోషల్ మీడియాలో కొంతమంది రైతులను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి వార్తలు పూర్తిగా అసత్యమని ఆయన స్పష్టం చేశారు. యూరియాను ఇప్పటివరకు 30,395 మెట్రిక్ టన్నులు, 11,426 మెట్రిక్ టన్నులు డి.ఏ.పి, 9379 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ వివిధ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు.

News September 18, 2025

యూరియా తగినంత ఉంది కలెక్టర్ కీర్తి

image

జిల్లాలో యూరియా కొరతపై వ్యాపించిన వదంతులను నివృత్తి చేయడానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామాన్ని సందర్శించారు. దొమ్మేరు ప్యాక్స్ వద్ద రైతులు, అధికారులతో ఆమె మాట్లాడారు. జిల్లాలో యూరియా తగినంత నిల్వ ఉందని, రైతులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.