News November 19, 2025

పెద్దారవీడు వద్ద ఎద్దుల అరకలను ఢీకొని దోర్నాల వ్యక్తి మృతి

image

పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న ఎద్దుల అరకలను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. వారిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు దోర్నాల మండలం యడవల్లికి చెందిన నల్లబోతుల శివగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 28, 2026

గ్రూప్ – 2 ఫలితాల్లో సత్తా చాటిన ప్రకాశం పోలీసులు

image

తాజాగా విడుదలైన గ్రూప్ – 2 ఫలితాలలో ప్రకాశం పోలీస్ శాఖకు చెందిన కానిస్టేబుళ్లు తమ సత్తా చాటారు. 2018 సివిల్ పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికైన కే. అశోక్ రెడ్డి, కే .వెంకటేశ్వర్లు, సూర్య తేజలు గ్రూప్ – 2 ఫలితాలలో పలు ఉద్యోగాలను సాధించారు. అశోక్ రెడ్డి డిప్యూటీ తహశీల్దారుగా, ఎక్సైజ్ ఎస్సైలుగా వెంకటేశ్వర్లు, సూర్య తేజలు ఎంపికయ్యారు. వీరికి తోటి సిబ్బందితో పాటు అధికారులు అభినందనలు తెలిపారు.

News January 28, 2026

గ్రూప్ -2లో ప్రకాశం వాసుల ప్రతిభ

image

గ్రూప్ -2 ఫలితాలలో ప్రకాశం జిల్లా వాసులు సత్తా చాటారు. CS పురానికి చెందిన నవీన్ యాదవ్ వెలిగండ్లలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పని చేస్తూ గ్రూప్-2 పరీక్షలు రాసి డిప్యూటీ తహశీల్దార్‌గా ఎన్నికయ్యారు. అలాగే కనిగిరికి చెందిన మహమ్మద్ సమీర్ టీచర్ పని చేస్తూ.. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. వీరి విజయం కుటుంబంలో సంతోషాన్ని నింపుతోంది.

News January 28, 2026

ప్రకాశం: రైలొచ్చిందంటే..అన్నీ అవుతాయ్.!

image

నడికుడి-శ్రీకాళహస్తి కొత్త రైల్వే‌లైన్ ప్రాజెక్ట్‌తో ఎన్నో దశాబ్దాల కల నెరవేరనుంది. దీంతో ఎన్నో గ్రామాల ఆశ ఇప్పుడు పట్టాల మీద పరుగులు తీస్తోందని BJP ‘X’ వేదికగా ట్వీట్ చేసింది. ఇప్పటికే 88.65 KM పూర్తైన రైల్వే లైన్‌తో దర్శి, పొదిలి, కనిగిరి, ఆత్మకూరు, రాపూరులు భారత రైల్వే మ్యాప్‌పై గర్వంగా నిలుస్తున్నాయన్నారు. మోదీ ప్రభుత్వం పట్టాలు వేసింది రైలుకే కాదు.. బంగారు భవిష్యత్తుకి అని ‘X’లో కొనియాడారు.