News November 5, 2025

పెద్దూరులో అత్యధిక వర్షపాతం నమోదు

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో గడచిన 24 గంటలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా తెలకపల్లి మండలం పెద్దూరులో 69.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమ్మెర 57.3, వెల్దండ 41.8, కల్వకుర్తి, యంగంపల్లి 40.0, బొల్లంపల్లి 39.0, ఊర్కొండ 33.3, ఉప్పునుంతల 30.8, పెద్దకొత్తపల్లి 20.0, తెలకపల్లి 19.3, వంకేశ్వర్ 14.0, లింగాల 9.8, మంగనూరులో 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

Similar News

News November 5, 2025

ప్రెగ్నెన్సీ రావాలంటే వాటికి దూరంగా ఉండండి

image

చాలా మంది అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు పిల్స్‌ వాడుతుంటారు. కానీ ఇవి తరువాతి కాలంలోనూ ప్రెగ్నెన్సీ రాకుండా నిరోధించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేయడానికి కనీసం రెండేళ్ల ముందు నుంచి, అలా వీలుకాకపోతే కనీసం 6 నెలలు ముందు నుంచి గర్భనిరోధక మాత్రలు వాడకపోవడం మంచిది. వీటితో పాటు దంపతులు ఆల్కహాల్‌, పొగాకు ఉత్పత్తుల్ని మానేయాలని సూచిస్తున్నారు. <<-se>>#Pregnancycare<<>>

News November 5, 2025

పంజాబ్& సింధ్ బ్యాంక్‌లో 30 పోస్టులు

image

పంజాబ్ & సింధ్ బ్యాంక్‌(<>PSB<<>>)లో 30 MSME రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 26 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 25 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్ర్కీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://punjabandsind.bank.in

News November 5, 2025

ప్రొద్దుటూరు: 8 మంది క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులపై కేసు నమోదు

image

ప్రొద్దుటూరు పోలీసులు బెట్టింగ్ మాఫియాపై ఉక్కు పాదం మోపుతున్నారు. తన బ్యాంక్ అకౌంట్లను బెట్టింగ్‌లకు ఉపయోగించారని జగన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో 8 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో ప్రొద్దుటూరుకు చెందిన వీర శంకర్, చెన్న కృష్ణ, నరేంద్ర, మేరువ హరి, సుధీర్ కుమార్ రెడ్డి, కృష్ణా రెడ్డి, రవితేజ, పోరుమామిళ్ళ (M) నాయునిపల్లెకు చెందిన చంద్ర ఉన్నారు. ఈ కేసును 2 టౌన్ CI సదాశివయ్య దర్యాప్తు చేస్తున్నారు.