News April 14, 2025

పెద్దెముల్: గోల్డ్ మెడల్ సాధించిన యువతి

image

పెద్దెముల్ మండలం మన్సాన్ పల్లి గ్రామానికి చెందిన యువతి బాక్సింగ్‌లో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. 7వ యూత్ అండర్‌-19 పురుషుల, మహిళల బాక్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు సికింద్రాబాద్ లాలాపేట్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ మున్సిపల్ స్టేడియంలో 11, 12వ తేదీల్లో జరిగాయి. నిఖిత గోల్డ్ మెడల్ సాధించినట్లు నిర్వాహకులు తెలపారు.

Similar News

News April 13, 2026

పెదపరిమిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

image

రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పెదపరిమిలో రెండో విడత భూ సమీకరణకు శ్రీకారం చుట్టింది. 6,000 ఎకరాల్లో తొలి దశగా 3,072 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే కనెక్టివిటీ, స్పోర్ట్స్ సిటీ వంటి కీలక ప్రాజెక్టులకు ఈ భూములు వినియోగించనున్నారు.

News April 13, 2026

పీజీఆర్ఎస్‌లో 20 ఫిర్యాదుల స్వీకరణ: ఎస్పీ

image

ప్రజల సమస్యలను చట్టపరిధిలో నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని ఎస్పీ అదాన్ నయీం అస్మి తెలిపారు. సోమవారం గొల్లలకోడేరులోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఆయన 20 అర్జీలను స్వీకరించారు. బాధితులు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు.

News April 13, 2026

సిరిసిల్ల: పరీక్షకు ఏడుగురు విద్యార్థులు గైర్హాజరు

image

సిరిసిల్ల జిల్లాలో సోమవారం జరిగిన పదవ తరగతి పరీక్షకు ఏడుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారని సిరిసిల్ల జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 7317 మంది విద్యార్థులకు 7310 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. జిల్లాలోని 34 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు.