News March 13, 2025
పెద్ద కార్పాముల: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

పెద్దకొత్తపల్లి మండల పరిధిలో మార్చి 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసుల వివరాలు.. పెద్దకొత్తపల్లి నుంచి పెద్దకార్పాములకు రాములు, స్వామిలు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ముందెళ్తున్న బైక్‌ని ఢీకొని కిందపడగా.. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరినీ HYDలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా బుధవారం రాములు చనిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు.
Similar News
News March 13, 2025
పార్వతీపురం జిల్లా ఎస్పీ హెచ్చరిక

సారా, మద్యం అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ ఎస్.వి మాధవరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రాక్టికల్ శిక్షణకు వచ్చిన ఎస్ఐలకు పోలీస్ స్టేషన్లకు కేటాయించామన్నారు. వారు ప్రస్తుత ఎస్ఐలతో కలిసి ఏజెన్సీ ప్రాంతాల్లో సారా, అక్రమమద్యం, గంజాయి, మాదకద్రవ్యాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అక్రమ రవాణా చేసి పట్టుబడితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
News March 13, 2025
భువనగిరి: ‘నీటి ఎద్దడికి తక్షణమే చర్యలు చేపట్టాలి’

భువనగిరి జిల్లాలో వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ గంగాధర్ ఆదేశించారు. సబ్‌కి యోజనా సబ్‌కా వికాస్‌లో భాగంగా జడ్పీ సీఈవో శోభారాణి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పంచాయితీ ప్లానింగ్ కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను ముందస్తుగా గుర్తించి ప్రణాళికబద్ధంగా మిషన్ భగీరథ నీటిని అందించాలన్నారు.
News March 13, 2025
మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

AP: రాష్ట్రంలోని 164 మోడల్ స్కూళ్లలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 17 నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవచ్చని విద్యాశాఖ తెలిపింది మార్చి 18 నుంచి మే 22 లోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. టెన్త్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ల ప్రతిపాదికన మే 26న సీట్లు కేటాయిస్తారు. 27న వెరిఫికేషన్ నిర్వహిస్తారు. జూన్‌లో తరగతులు ప్రారంభమవుతాయి. apms.ap.gov.in