News March 28, 2024
పెద్ద కొడప్గల్: ఎస్సై పై దాడి చేసిన వారిపై కేసు

పెద్ద కొడప్గల్ ఎస్సై కోనారెడ్డి, సిబ్బందిపై దాడికి పాల్పడిన దుండగులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బిచ్కుంద ఎస్సై తెలిపారు. బేగంపూర్ గేటు వద్ద మంగళవారం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఎస్సై కోనారెడ్డి, సిబ్బందిపై కాస్లాబాద్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మద్యం తాగి వచ్చి గొడవకు దిగి, దాడికి పాల్పడినట్లు వెల్లడించారు.
Similar News
News April 21, 2025
NZB: TGSRTCలో జాబ్స్.. ప్రిపరేషన్‌కు READY

TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో NZBలో నిరుద్యోగులు ప్రిపరేషన్‌కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.
News April 21, 2025
ఎడపల్లి: దారుణం.. మరదలిని చంపేసింది..!

అరెకరం భూమి, పెన్షన్ డబ్బుల కోసం సొంత మరదలిని వదిన హత్య చేసిన ఘటన NZB జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్‌లో వెలుగు చూసింది. ఈ ఘటన ఈ నెల3న చోటు చేసుకోగా పోలీసుల విచారణలో సొంత వదిన అనసూయ, మరో వ్యక్తి రాకేశ్ హత్యకు పాల్పడినట్లు తేలింది. పురుమెటి లక్ష్మీ మానసిక దివ్యాంగురాలు తన తల్లిదండ్రులు ఇచ్చిన అరెకరం తన పేరుమీద పట్టా చేయమనడంతో వదిన ఈ ఘాతుకానికి పాల్పడింది. పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
News April 20, 2025
NZB: ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి: సీపీ

భవనాలు, పరిశ్రమలు, పాఠశాలలు, దుకాణాల్లో ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని సీపీ సాయి చైతన్య సూచించారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం నిజామాబాద్ ఫైర్స్టేషన్లో నిర్వహించారు. అనంతరం పదవీ విరమణ చేసిన లీడింగ్ ఫైర్మెన్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ నర్సింగ్ రావు, సూపరింటెండెంట్, సిబ్బంది పాల్గొన్నారు.