News March 20, 2024
పెనమలూరు కూటమి అభ్యర్థిగా దేవినేని చంద్రశేఖర్?

పెనమలూరు TDP-జనసేన-BJP కూటమి MLA అభ్యర్థిగా దేవినేని చంద్రశేఖర్‌ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ నారా లోకేశ్‌కి అత్యంత సన్నిహితుడు. ఇప్పటికే అధిష్ఠానం IVRS సర్వే కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. యువగళం సమయంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈయనకే ఈసారి టికెట్ ఇస్తారని విశ్వసనీయ సమాచారం.
Similar News
News April 20, 2025
కోర్టుకెళ్లి నష్టపరిహారం వసూలు చేస్తా: ఎమ్మెల్యే

హైదరాబాద్ పరిధిలోని కొండాపూర్‌లో 39 ఎకరాల స్థల వివాదంలో హైడ్రా రంగంలోకి దిగింది. శనివారం పోలీసుల బందోబస్తుతో అక్కడికి చేరుకున్న అధికారులు, స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌తో పాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించారు. ఈ స్థలం ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌కు చెందినదని సమాచారం. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లి నష్టపరిహారం వసూలు చేస్తామని తెలిపారు.
News April 20, 2025
బంటుమిల్లి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

బంటుమిల్లి మండలం నారాయణపురం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మచిలీపట్నంకు చెందిన వాసాబత్తిన వీరాచారి (29) ,అనకాపల్లి ప్రసాద్ (28) రాజమండ్రి నుంచి బైక్ పై మచిలీపట్నం వస్తుండగా కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ ఇరువురు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
News April 20, 2025
మచిలీపట్నం: అఘోరిపై ఆడిషన్ ఎస్పీకి ఫిర్యాదు

భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ అంబేద్కర్‌ను దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన అఘోరి శ్రీనివాసపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా సంఘం అధ్యక్షుడు దోవా గోవర్ధన్ ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ వివి నాయుడుకు ఫిర్యాదు చేశారు.