News October 8, 2025

పెనమలూరు: భర్త మందులు తీసుకురాలేదని ఆత్మహత్య

image

కానూరులో నివాసం ఉంటున్న మధులత 5ఏళ్ల నుంచి సోరియాసిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. భర్త నాగేశ్వరరావుకు మందులు తీసుకురమ్మని వాట్సాప్‌లో చీటీ పెట్టగా.. అందులో అండర్ లైన్ చేసిన మందు మాత్రమే భర్త తీసుకువచ్చాడు. అన్ని మందులు తేకుండా ఒక ముందు మాత్రమే తెచ్చాడని భర్తను ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్థాపానికి గురైన మధులత ఇవాళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News October 9, 2025

ధాన్యం సేకరణ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో ఖరీఫ్ సీజన్ 2025 -26 సంవత్సరానికి సంబంధించి ధాన్యం సేకరణ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పెనమలూరు మండలం పోరంకిలోని 3వ సచివాలయం నుంచి వ్యవసాయ, పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ధాన్యం సేకరణకు చేపట్టాల్సిన పటిష్ట చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

News October 8, 2025

MTM: 10, 11న జీఎస్టీ ఎగ్జిబిషన్

image

‘సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్’ ప్రచార కార్యక్రమాలలో భాగంగా, ఈ నెల 10, 11 తేదీలలో ఎలక్ట్రానిక్ వస్తువులతో కూడిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను నిర్వహించాలని కలెక్టర్ బాలాజీ సంబంధిత అధికారులను బుధవారం ఆదేశించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, వినియోగదారులకు తగ్గింపు ధరల్లో వస్తువులు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News October 8, 2025

గృహ నిర్మాణాల పురోగతిపై నిర్లక్ష్యాన్ని సహించేది లేదు: కలెక్టర్

image

జిల్లాలోని గృహ నిర్మాణాల పురోగతిపై నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను హెచ్చరించారు. ఆయన కలెక్టరేట్‌లోని PGRS మీటింగ్ హాలులో గృహ నిర్మాణ పురోగతిపై ఆయన సమీక్షించారు. జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతి ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలకు కేవలం 2 లేదా 3 మాత్రమే పూర్తి చేస్తున్నారని ఇది ఎంత మాత్రం సరైనది కాదన్నారు.