News September 13, 2025
పెనుకొండలో భార్యను హత్య చేసిన భర్త

పెనుకొండలో భార్యను భర్త హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. అల్తాఫ్ ఖాన్ తన భార్య సుమియా భాను(27)ను పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాలని గొడవపడేవాడు. దీనిపై కేసు నమోదైంది. అప్పట్నుంచి పిల్లలతో పుట్టింటిలోనే ఉంటోంది. ఆగస్టు 26న పిల్లలను, ఆమెను తన గదికి తీసుకెళ్లి అల్తాఫ్ దారుణంగా కొట్టాడు. తీవ్రగాయాలైన సుమియాను కుటుంబీకులు హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం బెంగళూరు తీసుకెళ్లగా శుక్రవారం మృతిచెందింది.
Similar News
News September 13, 2025
అనకాపల్లి: కుప్పలుగా పడి ఉన్న చనిపోయిన కోళ్లు

అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చనిపోయిన బాయిలర్ కోళ్లు దర్శనమిస్తున్నాయి. దేవరాపల్లి మండలం మారేపల్లి శివారు చేనులపాలెం వద్ద రైవాడ కాలువతోపాటు చెరువుల్లో శనివారం చనిపోయిక కోళ్లు కనిపించాయి. పరిసర ప్రాంతాల్లో పౌల్ట్రీ యజమానులు చనిపోయిన వందలాది కోళ్ళను రాత్రి సమయంలో కాలువల్లో వేసి వెళ్లిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు నిఘా పెట్టాలని కోరుతున్నారు.
News September 13, 2025
సిద్దిపేట: చేనుకు చావు.. రైతుకు దుఃఖం

జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుంది. ముఖ్యంగా మొక్కజొన్నకు యూరియా చల్లే అదను దాటిపోవడంతో పంట ఎదగక పోవడం కళ్లముందే పంటనాశనం కావడం రైతులను కుంగదీస్తుంది. ఇప్పుడు యూరియా లభించి పోసినా లాభం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. దుబ్బాక నియోజకవర్గం అప్పాయిపల్లికి చెందిన రైతు బాలయ్య, హుస్నాబాద్ మండలం మీర్జాపూర్‌కు చెందిన రైతు శ్రీకాంత్ మొక్కజొన్న పంటలో పశువులను కట్టేసి మేపుతూ ఆవేదన చెందారు.
News September 13, 2025
సిద్దిపేట: నిరుద్యోగులను మోసం చేసిన సీఎం: హరీశ్ రావు

రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. శనివారం సిద్దిపేటలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆయన హాజరై మాట్లాడారు. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. గ్రూప్-1 పరీక్షల అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.