News February 15, 2025
పెనుకొండ ఉపాధ్యాయుడికి జైలు శిక్ష

పెనుకొండకు చెందిన మాజీ పాత్రికేయుడు మహేశ్ వద్ద ఐదేళ్ల క్రితం రూ.3.24 లక్షలను ఉపాధ్యాయుడు సూర్యనారాయణ రెడ్డి అప్పుగా తీసుకున్నారు. తిరిగి ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం శుక్రవారం న్యాయమూర్తి సయ్యద్ ముజీబ్ ఫసల్ ఉపాధ్యాయుడికి 6నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. రూ.6.48లక్షలు చెల్లించాలని పేర్కొన్నారు. నిందితుడిని పోలీసులు సబ్ జైలుకు తరలించారు.
Similar News
News March 13, 2025
HNK: ఇనుపరాతి గుట్ట భూములపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, దేవునూరు గ్రామాల్లో విస్తరించి ఉన్న ఇనుపరాతి గుట్ట పరిధిలో ఫారెస్ట్ అధికారులు గుర్తించిన వ్యవసాయ పట్టాభూములపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయ భూముల సర్వే, సంబంధిత రైతుల గుర్తింపు, తదితర వివరాలను సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
News March 13, 2025
నితీశ్ రాజీనామా చేసి ఆశ్రమానికి వెళ్లు: తేజస్వీ యాదవ్

బిహార్ సీఎం నితీశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. నితీశ్ రాష్ట్రాన్ని పాలించేందుకు ఫిట్‌గా లేరని దుయ్యబట్టారు. ఆయన ప్రవర్తన సరిగా లేదని, మహిళలను అవమానపరుస్తున్నారని తేజస్వీ ఆరోపించారు. నితీశ్ స్పృహ లేకుండా పాలన చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంటనే పదవికి రాజీనామా చేసి ఆశ్రమానికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
News March 13, 2025
సిద్దిపేట: 14 నుంచి 29 వరకు అన్ని బంద్: సీపీ

అనుమతులు లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేపట్టవద్దని సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 14 నుంచి 29 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధించినట్లు తెలిపారు. డీజేలు సైతం నిషేధించినట్లు సీపీ తెలిపారు.