News March 19, 2025
పెనుగంచిప్రోలు ఘటనలో 9 మందిపై కేసు నమోదు

పెనుగంచిప్రోలులో మంగళవారం జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించి 9 మందిపై కేసు నమోదు చేసినట్లు జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ ఏసోబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన వెంకటేశ్వరరావు, గోపి, మణికంఠ, నాగబాబు, సుదీర్, వేల్పుల అజయ్, యాదగిరి, శ్రీహరి, వెంకటేశ్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పలువురిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
Similar News
News November 5, 2025
చలికాలంలో జుట్టూడకుండా ఉండాలంటే..

మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువ. కాబట్టి జుట్టు సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. తలస్నానానికి గోరువెచ్చటి నీటినే వాడాలి. తర్వాత కండీషనర్ మర్చిపోకూడదు. జుట్టు త్వరగా ఆరడానికి బ్లో డ్రైయ్యర్స్ వాడటం తగ్గించాలని సూచిస్తున్నారు. ఈ సీజన్లో వెంట్రుకలకు ఎంత తరచుగా ఆయిల్ పెడితే అంత మంచిది. తేమ శాతం నిలిచి జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుందంటున్నారు.
News November 5, 2025
యూట్యూబర్‌పై క్రిమినల్ కేసు నమోదు

AP 175 న్యూస్ యూట్యూబర్ M.శ్రీనివాసరావుపై కందుకూరులో క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు CI అన్వర్ బాషా తెలిపారు. AP175 న్యూస్, గుండుసూది పేర్లతో శ్రీనివాసరావు సంచలనాత్మక కథనాలను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటారు. కందుకూరు MLA ఇంటూరిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆయన ఇటీవల వీడియోలు పోస్ట్ చేశారు. కొందరితో కుట్ర చేసి MLA పరువుకు భంగం కలిగేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా పోస్ట్ చేస్తున్నారని కేసు నమోదైంది.
News November 5, 2025
నేడు స్కూళ్లు, ఆఫీసులకు సెలవు

ఇవాళ గురుపూర్ణిమతో పాటు గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణలో విద్యాసంస్థలు, బ్యాంకులు, ఆఫీసులు మూసి ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. అటు ఏపీలో ఆప్షనల్ హాలిడే మాత్రమే ఉంది కాబట్టి స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి ఉండనున్నాయి. ఉద్యోగులు ఎవరైనా కావాలనుకుంటే సెలవు తీసుకోవచ్చు.


