News January 7, 2025

పెనుగొలనులో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి

image

గంపలగూడెం మండలంలోని పెనుగొలనులో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేసి బంధం నాగమణి అనే నిర్వాహకురాలిని అరెస్ట్ చేసినట్లు తిరువూరు సీఐ కె.గిరిబాబు తెలిపారు. నిందితురాలిని తిరువూరు కోర్టులో హాజరు పరిచి రిమాండ్ నిమిత్తం నూజివీడు సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సీఐ హెచ్చరించారు.

Similar News

News January 8, 2025

కృష్ణా: రూ.4,612 కోట్ల పనులకు మోదీ ప్రారంభోత్సవాలు

image

విశాఖపట్నంలో నేడు బుధవారం పర్యటించనున్న ప్రధాని మోదీ పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని మచిలీపట్నం- గుడివాడ- భీమవరం- నిడదవోలు రైల్వేలైన్ డబ్లింగ్, విద్యుదీకరణ చేసిన లైన్లను నేడు ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే విధంగా విజయవాడ- గుడివాడ- భీమవరం- నరసాపురం రైల్వే లైన్‌ను రూ.4,612 కోట్లతో చేపట్టగా ఆ లైన్‌లను మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

News January 8, 2025

పేర్నినానికి బెయిల్ ఇవ్వొద్దు: అడ్వకేట్

image

మాజీ మంత్రి పేర్ని నాని గోదాములో రేషన్ బియ్యాన్ని మాయం చేశారన్న వాటిపై అన్ని ఆధారాలు ఉన్నాయని బెయిల్ ఇవ్వొద్దని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో వాదనలు వినిపించారు. గోడౌన్ మేనేజర్ నుంచి పేర్ని నాని బ్యాంకు అకౌంట్‌కు డబ్బులు బదిలీ అయినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నానికి బెయిల్ ఇస్తే దర్యాప్తు ప్రభావితం చేస్తారన్నారు. బెయిల్ పిటీషన్‌ను 20కి వాయిదా వేసింది. అప్పటి వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

News January 8, 2025

మచిలీపట్నంలో దారుణ హత్య

image

మచిలీపట్నంలో ఓ వ్యక్తి మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. చిలకలపూడికి చెందిన రవి అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ రవిని హుటాహుటిన సర్వజన ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.