News September 22, 2025
పెనుమూరు : మహిళా పోలీస్ సస్పెండ్

పెనుమూరు మండలంలోని సీఆర్. కండ్రిగ గ్రామ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి శకుంతలకు కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెన్షన్ ఆర్డర్లు జారీ చేశారు. పెనుమూరు ఎంపీడీవో ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆమె రిజిస్టర్‌లో సంతకం చేయకపోవడంతో పాటు బయోమెట్రిక్ హాజరు కూడా నమోదు కాలేదని అన్నారు. కారణం ఏమిటని అడగ్గా సమాధానం సక్రమంగా లేని కారణంగా చర్యలు చేపట్టారు.
Similar News
News September 22, 2025
బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించిన చిత్తూరు ఎంపీ

హైదరాబాద్ గచ్చిబౌలి గౌవనంపల్లి జర్నలిస్టు కాలనీ ఫేజ్–3లో బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు జెండా ఊపి బోనాలను ప్రారంభించారు. అనంతరం మహిళలు రంగురంగుల బతుకమ్మలను అలంకరించి పాటలతో సందడి చేశారు. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఎంపీ ప్రసాదరావు ఉత్సవాల్లో పాల్గొన్నారు.
News September 21, 2025
సెలవుల్లో తరగతులు నిర్వహించరాదు: చిత్తూరు DEO

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈనెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలు(మైనారిటీ పాఠశాలలు తప్ప) కచ్చితంగా దసరా సెలవులను అమలు చేయాలన్నారు. సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించరాదన్నారు. జిల్లాలోని మైనారిటీ పాఠశాలలకు ఈనెల 27 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపారు.
News September 21, 2025
చిత్తూరు: మొక్కలు నాటిన ఎస్పీ

ప్రతి నెల మూడవ శనివారం “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛత దివస్” కార్యక్రమాన్ని నిర్వహించాలని చిత్తూరు నూతన ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయం నందు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛత అనేది మన బాధ్యత మాత్రమే కాదని, అది మన సమాజానికి ఇచ్చే బహుమతి అన్నారు.