News December 26, 2025
పెన్నా నదిలో చిక్కుకున్న వృద్ధుడిని కాపాడిన పోలీసులు

పెన్నా నదిలో చిక్కుకున్న వృద్ధుడిని కోవూరు పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఓ వృద్ధుడు గేదెలను తోలుకుంటూ జమ్మిపాళెం వద్ద పెన్నా నదిలోకి వెళ్లిన సమయంలో పెన్నా బ్యారేజ్ నుంచి నీరు విడుదల కావడంతో నదిలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో ఘటనా ప్రాంతానికి చేరుకొని స్థానిక ఈతగాళ్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టి వృద్ధుడిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.
Similar News
News December 30, 2025
నెల్లూరు జిల్లాలో డివిజన్లు ఇలా..!

➤నెల్లూరు(12): సైదాపురం, రాపూరు, పొదలకూరు, వెంకటాచలం, మనుబోలు, టీపీ గూడూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, కోవూరు, బుచ్చి, నెల్లూరు సిటీ, రూరల్
➤కావలి(12): వీకే పాడు, కొండాపురం, వింజమూరు, కొడవలూరు, విడవలూరు, దుత్తలూరు, కలిగిరి, జలదంకి, దగదర్తి, అల్లూరు, బోగోలు, కావలి
➤ఆత్మకూరు(9): కలువాయి, చేజర్ల, సంగం, ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, ASపేట, ఉదయగిరి, సీతారామపురం
➤గూడూరు(3): కోట, చిల్లకూరు, గూడూరు
News December 30, 2025
కొత్తగా నెల్లూరు జిల్లా ఇలా..!

☞ డివిజన్లు: 4(నెల్లూరు, కావలి, గూడూరు, ఆత్మకూరు)
☞ మండలాలు: 36
☞ జనాభా: 22,99,699
☞ నియోజకవర్గాలు: 8
☞ కందుకూరును ప్రకాశంలో కలపడంతో ఆ డివిజన్‌లోని కొండాపురం, వరికుంటపాడు మండలాలు కావలి డివిజన్‌లోకి చేరాయి. కలువాయిని ఆత్మకూరులో, రాపూరు, సైదాపురాన్ని నెల్లూరు డివిజన్‌లో విలీనం చేశారు. 3మండలాలతోనే గూడూరు(కోట, వాకాడు, గూడూరు) డివిజన్ ఉంటుంది.
News December 30, 2025
BJP యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా భరత్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా చింతలపల్లి భరత్ రెడ్డిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్. వంశీధర్ రెడ్డి సోమవారం నియమించారు. భరత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్. వంశీధర్ రెడ్డికు, పార్టీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.


