News December 26, 2025
పెన్నా నదిలో చిక్కుకున్న వృద్ధుడిని కాపాడిన పోలీసులు

పెన్నా నదిలో చిక్కుకున్న వృద్ధుడిని కోవూరు పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఓ వృద్ధుడు గేదెలను తోలుకుంటూ జమ్మిపాళెం వద్ద పెన్నా నదిలోకి వెళ్లిన సమయంలో పెన్నా బ్యారేజ్ నుంచి నీరు విడుదల కావడంతో నదిలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో ఘటనా ప్రాంతానికి చేరుకొని స్థానిక ఈతగాళ్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టి వృద్ధుడిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.
Similar News
News December 30, 2025
సందిగ్ధంలో గూడూరు సబ్ కలెక్టర్ పోస్టు..?

గూడూరు సబ్ కలెక్టర్ పోస్టుకు మోక్షం కలగడం లేదు. ఇక్కడ సబ్ కలెక్టర్‌గా పనిచేసిన రాఘవేంద్ర మీనన్ బదిలీ అయి 2 నెలలు గడుస్తోన్నప్పట్నుంచి ఇంచార్జిగా శ్రీకాళహస్తి RDO భానుప్రకాష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయన రెండు చోట్ల విధులు నిర్వహించాల్సి రావడంతో ప్రజల సమస్యలు పరిష్కారం కావడంలో ఆలస్యం నెలకొంది. గూడూరు నెల్లూరులో కలిపిన తరువాత అయినా.. పోస్టును భర్తీ చేయాల్సి ఉంది.
News December 30, 2025
నెల్లూరు: జిల్లా పునర్వ్యవస్థీకరణపై తుది నోటిఫికేషన్ విడుదల

APలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చేలా నెల్లూరు, తిరుపతి జిల్లాల మధ్య రెవెన్యూ డివిజన్లు–మండలాల పునర్విభజన చేపట్టారు. కొండాపురం, VKపాడును కావలి డివిజన్‌లోకి, గూడూరు, చిల్లకూరు, కోటను గూడూరు డివిజన్‌లోకి చేర్చారు. వాకాడు, చిట్టమూరు(M)ను S.పేట డివిజన్‌లోకి, బాలయపల్లి, వెంకటగిరి, డక్కిలిని శ్రీకాళహస్తి డివిజన్‌లోకి విలీనం చేశారు.
News December 30, 2025
నెల్లూరు: వారి మధ్య విభేదాలు లేనట్టేనా ?

కావలిలో బీద రవిచంద్ర, కావ్య కృష్ణారెడ్డి మధ్య వైరం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే.. బీదకు TDP అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత MLA దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కావ్య బీద రవిచంద్రను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో వారి మధ్య వైర ఉందా.. లేదా..? అనేదానికి చెక్ పెడతారా..?అనేది చూడాల్సి ఉంది.


