News October 1, 2025
పెన్షన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఆనంద్

అనంతపురంలోని బుడ్డప్ప నగర్లో బుధవారం ఉదయం పెన్షన్ లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 2లక్షల 79వేల మందికి పింఛన్లు అందజేస్తున్నామని తెలిపారు. అనంతరం అక్కడి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Similar News
News October 2, 2025
అంతర్జాతీయ ఫిడే క్లాసికల్ రేటింగ్‌లో చిన్నారి రతనతేజ్

అతిచిన్న వయసులోనే తాడిపత్రికి చెందిన చెస్ క్రీడాకారుడు చిన్నారి రతనతేజ్ బుధవారం విడుదల చేసిన అంతర్జాతీయ ఫిడే క్లాసికల్ రేటింగ్‌లో స్థానం సాధించాడు. శిక్షకుడు సురేంద్రనాథ్ మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్‌లోని ప్రపంచ చదరంగం సమాఖ్య విడుదల చేసిన ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ క్రీడాకారుల జాబితాలో కేవలం ఏడేళ్ల రతనతేజ్ ఉండటం ఆనందంగా ఉందన్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిటర్ ఉదయ్ కుమార్ అభినందించారు.
News September 30, 2025
రేషన్ షాపులకు అక్టోబర్ నెల రేషన్ సరుకుల రాక

అనంతపురం జిల్లాలోని 6,62,014 రైస్ కార్డుదారులకు సరిపడా నిత్యావసర సరుకులు 1645 చౌక ధరల దుకాణాలకు కేటాయించామని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ తెలిపారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ షాపుల వద్దనే బియ్యం కార్డుదారులకు సరఫరా చేస్తామని వెల్లడించారు.
News September 30, 2025
కలెక్టర్ ఆనంద్ మార్క్.. అధికారుల్లో దడ!

అనంతపురం (D) కలెక్టర్ ఆనంద్ తనదైన మార్క్ చూపిస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులకు వణుకు పుట్టిస్తున్నారు. ‘మార్పు రావాల్సిందే. లేకుంటే మార్చేస్తా’ అంటూ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఇటీవల ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో బాలుడు మృతిచెందడంతో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులను వెంటనే సస్పెండ్ చేశారు. అలాగే తన క్యాంపు కార్యాలయంలో వ్యక్తిగత సిబ్బందిని సైతం 9 నుంచి ముగ్గురికి తగ్గించడం విశేషం.