News June 27, 2024

పెన్షన్ల పంపిణీ లేటైతే చర్యలు: మంత్రి స్వామి

image

పెన్షన్ల పై మంత్రి స్వామి అధికారులకు కీలక సూచనలు చేశారు. వెలగపూడి సచివాలయంలో పెన్షన్ల పంపిణీపై అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. మరో 3 రోజుల్లో పెన్షన్లు పంపిణీ చేయనున్న నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులంతా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జులై 1వ తేదీ లోపే పింఛన్ల పంపిణీ పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధం కావాలన్నారు. ఇందులో జాప్యం జరిగితే చర్యలు తప్పవన్నారు.

Similar News

News October 7, 2024

రేపు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాక

image

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మంగళవారం ఒంగోలులో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లుగా ఆదివారం మాగుంట కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు స్థానిక రామ్ నగర్‌లో మాగుంట కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. 11 గంటలకు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో జరిగే స్వర్ణాంధ్ర – 2047 జిల్లా స్థాయి విజన్ సంప్రదింపులు, సలహాల సమావేశానికి హాజరవుతారన్నారు.

News October 7, 2024

ఒంగోలు పోలీసులు కొట్టడం వల్లే రాజశేఖర్ చనిపోయారు: నాగేంద్ర

image

ఒంగోలు టూ టౌన్ పోలీసులు కొట్టి అవమానించడం వల్లనే పరుచూరి రాజశేఖర్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్ర ఆరోపించారు. ఆదివారం ఒంగోలులోని GGHలో రాజశేఖర్ మృతదేహాన్ని పరిశీలించిన ఆయన ఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరగాలని.. మృతుడి కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

News October 6, 2024

ఒంగోలు: డిగ్రీ స్పాట్‌ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ విడుదల

image

డిగ్రీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి స్పాట్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ఒంగోలులోని డీఎస్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ కళ్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. తమ కళాశాలలో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన విద్యార్థులు స్పాట్‌ అడ్మిషన్‌ కోసం ఈనెల 9లోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటిదాకా డిగ్రీ ప్రవేశాలు పొందని ఇంటర్ విద్యార్థులు ఈఅవకాశాన్ని వినియోగించు కోవాలన్నారు.