News October 4, 2024
పెన్షన్ పంపిణీలో జిల్లా అగ్రస్థానం: కలెక్టర్

కర్నూలు జిల్లా పెన్షన్ పంపిణీలో 3 నెలలు వరుసగా అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు పెన్షన్ పంపిణీ అధికారులకు అభినందనలు తెలిపారు. శుక్రవారం 15 మంది అధికారులను ఆయన ఘనంగా సన్మానించారు. పెన్షన్ పంపిణీలో జిల్లా ప్రథమ స్థానంలో చేరేలా కృషిచేసిన డీఆర్డీఏ పీడీ సలీం బాషాను సత్కరించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News February 18, 2026
బాల్య వివాహాలు జరగకుండా చూడాలి: కలెక్టర్

కల్లూరు మండలం బస్తిపాడులోని గ్రామ సచివాలయంలో కలెక్టర్ ఏ.సిరి మండల సమాఖ్య పొదుపు సంఘాలతో సమావేశం నిర్వహించారు. పొదుపు సంఘాల మహిళలతో ఆమె మాట్లాడారు. గ్రామంలో బాల్య వివాహాలు చేస్తున్నారనే సమాచారం వస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం చేరవేసి, వాటిని ఆపాలన్నారు. చదువురాని వారు అక్షరాంధ్రలో ఎన్‌రోల్‌మెంట్ అవ్వాలని, చదువు వస్తే గౌరవం వస్తుందని తెలిపారు.
News February 18, 2026
కర్నూలు: మెడికల్ విద్యార్థిని సూసైడ్

గూడూరు(M) పెంచికలపాడు సమీపంలోని విశ్వభారతి మెడికల్ కాలేజీ విద్యార్థిని సోనిక(22) సూసైడ్ చేసుకుంది. ప్రకాశం(D) తుర్లపాడుకు చెందిన రత్నమయ్య కుమార్తె సోనిక పారామెడికల్ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా ఆమె కొంతకాలంగా మనస్తాపంతో ఉండేది. ఈ క్రమంలో మంగళవారం హాస్టల్ రూములో ఉరేసుకుంది. ఈ ఘటనపై కె.నాగలాపురం ఎస్ఐ అఖిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 18, 2026
కర్నూలు: హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

హోలీ పండుగ సందర్భంగా రైల్వే శాఖ తిరుపతి-రాక్సౌల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈనెల 21, 28న, మార్చి 7న తిరుపతి నుంచి ఉదయం 8.15 గంటలకు రైలు(07051) బయలుదేరి రెండో రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాక్సౌల్ చేరుకుంటుంది. తిరిగి ఈనెల 24న, మార్చి 3, 10న ఉదయం 8.30 గంటలకు రాక్సౌల్ నుంచి బయలుదేరి రెండో రోజు సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైళ్లు గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం మీదుగా నడుస్తాయి.


