News December 21, 2024

పెన్సిల్ ముక్కపై సూక్ష్మ కళ.. భళా..!

image

నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేశ్ ప్రపంచ ధ్యాన దినోత్సవం పురస్కరించుకొని వినూత్నంగా పెన్సిల్ ముక్కపై ధ్యానం చేస్తున్న వ్యక్తి, ప్రపంచ భూగోళం సూక్ష్మ చిత్రాలను వాటర్ కలర్స్‌తో మైక్రో బ్రష్ ద్వారా చిత్రించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకోవాలని ఏకగ్రీవంగా ఐక్యరాజ్య సమితి ఆమోదించిందన్నారు.

Similar News

News October 3, 2025

జిల్లా అభివృద్ధికి నిధులు విడుదల: కలెక్టర్

image

జిల్లా అభివృద్ధికి నీతి ఆయోగ్ ద్వారా నిధులు విడుదలైనట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. చిప్పగిరి ఆస్పిరేషనల్ బ్లాక్ అభివృద్ధికి రూ.1.50 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో అంగన్వాడీల అభివృద్ధికి రూ.35 లక్షలు, గ్రామీణ నీటి సరఫరా పనులకు రూ.95 లక్షలు, పాఠశాలల అభివృద్ధికి రూ.20 లక్షలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. నిర్దేశించిన కాల వ్యవధిలో అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

News October 3, 2025

ఈనెల 16న మోదీ పర్యటనను విజయవంతం చేయండి: కలెక్టర్

image

ఈనెల 16న ప్రధాని మోదీ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మోదీ పర్యటనలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లు, ప్రోటోకాల్, వేదిక, వసతి, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.

News October 3, 2025

కర్రల సమరంలో ముగ్గురి మృతి.. స్పందించిన కర్నూలు ఎంపీ

image

కర్నూలు(D) హొళగుంద(M) దేవరగట్టులో జరిగిన మాళమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవంలో ముగ్గురు భక్తులు మృతి చెందడంతో పాటు 100 మందికి పైగా గాయపడిన ఘటనపై కర్నూలు ఎంపీ నాగరాజు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో మాట్లాడిన ఆయన.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. స్వామి జైత్ర యాత్రలో భక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు.