News March 21, 2025

పెబ్బేరులో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కేసు నమోదు: ఎస్ఐ 

image

అక్రమాలకు పాల్పడుతూ అమాయకుల నుంచి రూ.లక్షలు దోచుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు గోనేల ఎల్లయ్య, బొడ్డుపల్లి రాజు అనే వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి గురువారం తెలిపారు. సర్వే నంబర్‌పై తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వారు ప్లాట్లు విక్రయించారని గద్వాల్‌కు చెందిన కళ్యాణ్ కుమార్ ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News January 7, 2026

బడ్జెట్ సమావేశాల తర్వాత కేంద్ర క్యాబినెట్ రీషఫుల్?

image

బడ్జెట్ సమావేశాల తర్వాత కేంద్ర క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిలో భాగంగా పలువురు మంత్రులను తొలగిస్తారని సమాచారం. ముఖ్యంగా మాజీ బ్యూరోక్రాట్లను పక్కన పెడతారని భావిస్తున్నారు. వారి స్థానంలో పార్టీ సీనియర్లు, సంఘ్‌ సన్నిహితులకు చోటు లభిస్తుందని చెబుతున్నారు. కాగా EX బ్యూరోక్రాట్స్ అయిన జైశంకర్‌, హర్దీప్‌, అర్జున్‌ రాం, అశ్వినీ వైష్ణవ్‌ ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు.

News January 7, 2026

నెల్లూరు: 15 మండలాలకు స్వచ్ఛ రథాలు.!

image

ప్రభుత్వం స్వచ్ఛ గ్రామాల సంకల్పంతో స్వచ్ఛ రథాలను అందుబాటులోకి తేనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలోని 15 మండలాల్లో గతంలో ఇంటింటికీ వచ్చి బియ్యం ఇచ్చే వాహనాల మాదిరిగా రథాలను సిద్ధం చేస్తున్నారు. ఈ రథాల్లో చెత్త సేకరణ గది, సరుకులతో కూడిన ప్రత్యేక ర్యాక్ ఉంటుంది. పొడి వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు, ఇనుప వస్తువులు అందిస్తే సరుకులు పొందవచ్చు. సరుకులు వద్దనుకుంటే నగదు చెల్లిస్తారు.

News January 7, 2026

HYDలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

image

సంక్రాంతి సందర్భంగా HYDలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. జనవరి 16- 18 వరకు పరేడ్ గ్రౌండ్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరగనుంది. అలాగే పరేడ్ గ్రౌండ్, బతుకమ్మ కుంట, నల్ల చెరువు తదితర ప్రాంతాల్లో పతంగులు, మిఠాయిల పండుగ నిర్వహిస్తారు. వీటితో పాటు జనవరి 16, 17 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యేకంగా డ్రోన్ ఫెస్టివల్ ఏర్పాటు చేయనున్నారు.