News March 21, 2025
పెబ్బేరులో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కేసు నమోదు: ఎస్ఐ

అక్రమాలకు పాల్పడుతూ అమాయకుల నుంచి రూ.లక్షలు దోచుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు గోనేల ఎల్లయ్య, బొడ్డుపల్లి రాజు అనే వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి గురువారం తెలిపారు. సర్వే నంబర్‌పై తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వారు ప్లాట్లు విక్రయించారని గద్వాల్‌కు చెందిన కళ్యాణ్ కుమార్ ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News December 31, 2025
GNT: Bro.. ఈరోజు సాయంత్రం ప్లాన్ ఏంటి.?

నేటితో 2025 ముగిసి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాం. ఇవాళ DEC 31st కావడంతో ఇప్పటికే చాలా మంది పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోయారు. రాత్రి ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పార్టీలకు ముందస్తు ప్లాన్స్ చేసుకున్నారు. కొందరు బార్లు, ఇంకొందరు ఇంట్లో, బయట వెకేషన్లలో.. లొకేషన్ ఏదైనా ప్రిపరేషన్ మాత్రం వేడుకలే. పార్టీలో ముక్కా, చుక్కా తప్పనిసరిగా ఉండాల్సిందే అంటున్నారు. మీ సాయంకాలం ప్లాన్స్ ఏంటో కామెంట్ చేయండి.
News December 31, 2025
NTR: మట్టి తవ్వకాలు.. సంపద దోపిడీ షురూ.!

మైలవరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కొత్తూరు, తాడేపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా 35ఎకరాల అసైన్డ్ భూముల్లో తవ్వకాలు జరుపుతూ ప్రకృతి సంపదను దోచేస్తున్నారు. గతంలో మైనింగ్ అధికారులు రూ.150కోట్ల రికవరీ నోటీసులు ఇచ్చి, ఆంక్షలు విధించినా అధికార పార్టీ నేతల అండతో దందా నిరాటంకంగా సాగుతోంది. CM చంద్రబాబు ‘సంపద సృష్టి’ అంటుంటే, క్షేత్రస్థాయిలో నేతలు ‘సంపద దోపిడీ’ చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
News December 31, 2025
పల్నాడు: ముగిసిన పిన్నెల్లి సోదరుల పోలీస్ విచారణ

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పోలీస్ విచారణ ముగిసింది. గుండ్లపాడు జంట హత్య కేసులకు సంబంధించి నెల్లూరు సెంటర్ జైల్లో రిమాండ్‌లో ఉన్న వారిని మాచర్ల రూరల్ పోలీసులు విచారించారు. దర్యాప్తులో భాగంగా సంఘటనపై వివరాలు తీసుకునేందుకు కోర్టు అనుమతితో పోలీసులు పిన్నెల్లి సోదరులను ప్రశ్నలు అడిగి, వారి నుంచి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.


