News April 21, 2025

పెబ్బేరు: ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధుడి మృతి

image

ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధుడు మృతి చెందిన ఘటన పెబ్బేరులో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ యుగంధర్ రెడ్డి వివరాలు.. పెబ్బేరుకు చెందిన బుచ్చన్న(65) శనివారం గొర్రెలకు గడ్డి తీసుకోస్తానని చెప్పి గ్రామ శివారులోని బావిలో స్నానం చేయడానికి దిగి ప్రమాదవశాత్తు మునిగి మరణించాడు. మృతుడి కుమారుడు రాజేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 16, 2025

హనుమకొండలో ఎన్నికలకు సర్వం సిద్ధం

image

జిల్లాలో బుధవారం జరిగే మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆత్మకూరు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్ స్వయంగా సందర్శించి, పోలింగ్ సామగ్రి పంపిణీని, సిబ్బంది రిపోర్టింగ్‌ను పర్యవేక్షించారు. ఈ విడతలో ఆత్మకూర్, దామెర, నడికూడ, శాయంపేట మండలాల్లోని 67 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది.

News December 16, 2025

సరిహద్దుల్లో కంచె నిర్మాణం.. ఎంత పూర్తయిందంటే?

image

దేశ భద్రతను పటిష్ఠం చేసేందుకు అంతర్జాతీయ సరిహద్దుల వెంట కంచె (ఫెన్సింగ్) ఏర్పాటు పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. లోక్‌సభలో కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ దీని వివరాలు వెల్లడించారు. ఇండియా-పాక్ 93.25% (2,135KMS), IND-బంగ్లాదేశ్ సరిహద్దులో 79.08% (3,239KMS) మేర కంచె నిర్మాణం పూర్తయిందన్నారు. IND-మయన్మార్ సరిహద్దులో 1,643 కి.మీల మేర పనులు జరుగుతున్నాయన్నారు.

News December 16, 2025

పంచాయతీ పోలింగ్‌కు పటిష్ఠ భద్రత: ఎస్పీ రోహిత్ రాజు

image

భద్రాద్రి: మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. 1288 పోలింగ్ కేంద్రాల్లో 1500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.