News February 16, 2025

పెబ్బేరు: భారీ మొసలిని పట్టుకున్న కృష్ణ సాగర్

image

పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామ సమీపంలో నరసింహ అనే రైతు వరి పొలంలో భారీ మొసలిని చూసి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే వనపర్తి జిల్లా సాగర్ స్నేక్స్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణ సాగర్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణసాగర్ తన బృందంతో మొసలిని చాకచక్యంగా పట్టుకుని బంధించారు.  

Similar News

News December 23, 2025

ఆ కోటి సంతకాలు చేసింది ఆత్మలా.. ప్రేతాత్మలా?: సత్యకుమార్

image

AP: కేంద్ర నిధుల్ని ఖర్చు చేయని గత పాలకులు PPPపై విమర్శలు చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ‘రప్పారప్పా అంటూ విధ్వంసకర భాష మాట్లాడుతున్నారు. ఆ నాయకుడి పుట్టిన రోజుకు జంతు బలులిచ్చారు. రక్తంతో రాసిన రాతలు తప్ప వారి ఘనతేం లేదు. కోటి సంతకాలు నిజమైనవే అయితే సమీక్షిస్తాం. మేమడిగితే ఎవరూ సంతకం పెట్టలేదన్నారు. మరి ఆ సంతకాలు ఆత్మలు పెట్టాయా? ప్రేతాత్మలు పెట్టాయా? అని మంత్రి ప్రశ్నించారు.

News December 23, 2025

డీఆర్‌డీవోలో పెయిడ్ ఇంటర్న్‌షిప్

image

<>DRDO<<>> యంగ్ సైంటిస్ట్ లాబోరేటరీ-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 5 ఇంటర్న్‌షిప్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ, బీటెక్(ఫైనల్ ఇయర్)/MSc, ఎంటెక్ చదువుతున్నవారు డిసెంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులు అంతకుముందు సెమిస్టర్‌లో ఫస్ట్ క్లాస్‌లో పాసై ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు స్టైపెండ్ రూ. 5వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://drdo.gov.in

News December 23, 2025

గన్నవరం: గడువులు మారుతున్నాయ్ కానీ.. పనులు పూర్తి కావడం లేదు.!

image

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ కొత్త టెర్మినల్ నిర్మాణం ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. 2018లో ప్రారంభమైన ఈ పనులు 8ఏళ్లు గడుస్తున్నా ముగింపునకు నోచుకోవడం లేదు. అనేక గడువులు దాటుకుంటూ వస్తున్నాయి. 2024లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, కూటమి MPలు జూన్-2025 నాటికి పూర్తి చేయాలని గడువు విధించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.