News January 30, 2026
పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

US-ఇరాన్ వైరం చమురు మార్కెట్‌ను ప్రభావితం చేస్తోంది. లండన్ మార్కెట్‌లో బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 2.4% పెరిగి $70.06కు చేరింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ కూడా 2.6% పెరిగి బ్యారెల్ $64.82కి చేరింది. US దాడి చేస్తే ఇరాన్ ఆయిల్ ఉత్పత్తి రోజుకు 3M బ్యారెల్స్ తగ్గనుందని నిపుణుల అంచనా. హార్ముజ్ జలసంధి రవాణాపై ప్రభావం పడొచ్చు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
Similar News
News February 15, 2026
‘బాషా’ నిర్మాత కన్నుమూత

ప్రముఖ తమిళ నిర్మాత, డైరెక్టర్ తమిళ్ అళగన్ కన్నుమూశారు. ఈయన మరణంపై సూపర్ స్టార్ రజినీకాంత్ సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. అళగన్ ప్రొడ్యూసర్‌గా బ్లాక్‌బస్టర్ ‘బాషా’, చిరంజీవి-రజినీ కాంబోలో ‘రానువ వీరన్’(తెలుగులో బందిపోటు సింహం) తదితర చిత్రాలను నిర్మించారు. పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. కాగా తమిళనాట లెజెండరీ ప్రొడ్యూసర్, రచయిత, మాజీ మంత్రి ఆర్ఎమ్ వీరప్పన్ కొడుకే ఈ అళగన్.
News February 15, 2026
భక్తురాలి అమాయకత్వానికి లొంగిపోయిన ఈశ్వరుడు

శివభక్తురాలైన గొడగూచిని తన తండ్రి ఊరెళ్తూ శివలింగానికి పాలు నైవేద్యంగా సమర్పించమని చెబుతాడు. గొడగూచి అమాయకమైన భక్తితో శివుడిని పాలు తాగమని వేడుకొంది. శివుడు పాలు తాగలేదు. దీంతో తనేమైనా తప్పు చేశానేమో అని బాధపడింది. ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఆమె నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆమె చేతి పాలు తాగాడు. అలిగి, అల్లరి చేసిన ఆ చిన్నారి భక్తురాలిని తనలో లీనం చేసుకున్నాడు.
News February 15, 2026
100 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల

ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(AFMS) షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 100 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. MBBS, పీజీ అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు MBBS అర్హత గలవారికి 30ఏళ్లు, పీజీ అర్హత గలవారికి 35ఏళ్లు. ఫిజికల్ ఫిట్‌నెస్ కలిగి ఉండాలి. వెబ్‌సైట్: www.join.afms.gov.in


