News September 23, 2025
పెరవలిలో రోడ్డు ప్రమాదం

తూ.గో జిల్లా పెరవలి మండలం తీపర్రు పరిధిలో మంగళవారం RTC బస్సు ప్రమాదానికి గురైంది. స్థానికుల వివరాల మేరకు.. తణుకు డిపోనకు చెందిన బస్సు రాజమండ్రి వెళ్తుండగా అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తణుకులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో కడింపాడుకు చెందిన సలాది సత్యనారాయణ (50) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News September 23, 2025
కడియం: అమ్మవారికి 95 కిలోల లడ్డూ

కడియం శ్రీదేవి చౌక్ సెంటర్‌లో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, అదే గ్రామానికి చెందిన ఎన్.నానాజీ అమ్మవారికి లడ్డూ సమర్పించారు. 95 కిలోల భారీ లడ్డూను మంగళవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సమర్పించారు. ఈ లడ్డూను 10 రోజులపాటు అమ్మవారి వద్ద ఉంచుతామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.
News September 23, 2025
ఆక్వా చెరువులకు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి: కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులు అందరూ APSADA Act – 2020 ప్రకారం తమ చేపల చెరువులను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ నెల 15వ తేదీ లోపు లైసెన్సులు పొందాలని ఆమె స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె ఈ మేరకు ఆదేశించారు.
News September 23, 2025
రాజమండ్రి: నేరాల కట్టడికి డ్రోన్‌తో నిఘా

జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం, గంజాయి వినియోగం వంటి నేరాలను కట్టడి చేయడానికి జిల్లావ్యాప్తంగా నిర్మానుష్య ప్రదేశాలలో ఈ ప్రత్యేక నిఘా కొనసాగుతుందని సోమవారం పోలీసులు తెలిపారు.