News December 7, 2025
పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో KG స్కిన్ లెస్ చికెన్ ధర ₹260గా ఉంది. వరంగల్, కామారెడ్డిలోనూ ఇవే రేట్లున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ, చిత్తూరులో ₹240-260, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ₹220-230 వరకు పలుకుతోంది. ఇక మటన్ కేజీ ₹800-900 వరకు అమ్ముతున్నారు. కోడిగుడ్డు ధర రిటైల్‌లో ఒక్కోటి ₹7-9కి అమ్ముతున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?
Similar News
News March 4, 2026
ఆయిల్ ధరలు భారీగా తగ్గొచ్చు: ట్రంప్

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతుండటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాక గతంలో కంటే కూడా తగ్గుతాయని భావిస్తున్నాని చెప్పారు. ఇరాన్‌పై ఇప్పుడు దాడి చేయకపోతే అణుయుద్ధం వచ్చేదన్నారు. కాగా ఇరాన్‌పై దాడుల్లో సహకరించని స్పెయిన్‌తో ట్రేడ్ రద్దు చేసుకుంటామన్న ట్రంప్ యూకేపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.
News March 4, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 4)

* 1886: స్వాతంత్ర్య సమరయోధుడు బులుసు సాంబమూర్తి జననం
* 1973: తెలుగు సినీ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి జననం
* 1964: తెలుగు, కన్నడ కవి కిరికెర రెడ్డి భీమరావు మరణం
* 2002: ఒడిశా, బెంగాల్, త్రిపుర మాజీ గవర్నర్ కె.వి.రఘనాథరెడ్డి మరణం (ఫొటోలో కుడివైపు)
* 2016: లోక్‌సభ మాజీ స్పీకర్ పి.ఎ.సంగ్మా మరణం
* జాతీయ భద్రతా దినోత్సవం
* ప్రపంచ ఊబకాయ దినోత్సవం
News March 4, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


