News March 1, 2026

పెరిగిన చికెన్ ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ట్రిపుల్ సెంచరీ దాటాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్‌లెస్ ధర రూ.280-300గా ఉంది. అటు ఏపీలోని విజయవాడలో రూ.270, విశాఖలో రూ.300, గుంటూరులో రూ.250గా ఉంది. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.

Similar News

News March 1, 2026

ఆ వీడియోలు ఫేక్: TTD ఛైర్మన్ BR నాయుడు

image

AP: డీప్‌ఫేక్ వీడియోలతో YCP నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని TTD ఛైర్మన్ BR నాయుడు ఫైర్ అయ్యారు. వ్యక్తిగతంగా తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకు, TTD ప్రతిష్ఠను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. AI ద్వారా ఎడిట్ చేసిన ఫేక్ వీడియోలను షేర్ చేస్తున్నారని మండిపడ్డారు. దీని వెనకున్నదెవరో తేల్చాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారిని వదిలిపెట్టనని ఆయన హెచ్చరించారు.

News March 1, 2026

ALERT: దంచికొట్టనున్న ఎండలు.. జాగ్రత్త

image

TG: ఈవారం ఎండలు దంచికొడతాయని, మార్చి 3 నుంచి 7 వరకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘భద్రాద్రి, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో 39-41°C వరకు ఎండలు నమోదవుతాయి. HYDలో 36-37°C ఉష్ణోగ్రతలు ఉండవచ్చు. వేసవి ప్రారంభమైనందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత నీరు తాగుతూ ఉండాలి’ అని సూచిస్తున్నారు. SHARE IT

News March 1, 2026

ఇదేం నీతి.. పాకిస్థాన్ ఉగ్రవాదం కనిపించట్లేదా ట్రంప్?

image

ఇరాన్ మిడిల్ ఈస్ట్‌లో ఉగ్రవాదులతో చేతులు కలిపి అశాంతికి కారణం అవుతోందని, న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తోందని అమెరికా దాడి చేసింది. సుప్రీం లీడర్‌ను చంపేసింది. ఇదే నీతి పాకిస్థాన్‌కు ఎందుకు వర్తించదని పలువురు ప్రశ్నిస్తున్నారు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా లాంటి ఉగ్రసంస్థలను పాక్ పెంచి పోషిస్తోందని భారత్ చాలా సార్లు నిరూపించింది. అయినా అమెరికా పాక్‌కు సపోర్ట్ చేస్తోందే తప్ప చర్యలు తీసుకోలేదు.