News February 14, 2026
పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.1,970 పెరిగి రూ.1,57,750కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేటు రూ.1,800 పెరిగి రూ.1,44,600 పలుకుతోంది. మరోవైపు ఇవాళ వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కేజీ వెండి రేటు రూ.2.80 లక్షలుగా ఉంది.
Similar News
News February 14, 2026
2 వారాల్లో MPTC, ZPTC ఎన్నికలు.. నేడు నిర్ణయం!

TG: పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ ఇక MPTC, ZPTC ఎన్నికలపై ఫోకస్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఫలితాలను సమీక్షించడంతోపాటు అసెంబ్లీ సమావేశాలు, సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ, పరిషత్ ఎన్నికల నిర్వహణపైనా చర్చించనున్నారు. మరో రెండు వారాల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేయనున్నారు.
News February 14, 2026
నువ్వులతో ఎన్నో లాభాలు

నువ్వుల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. BP, కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ తగ్గించడంలో కీలకంగా ఉంటాయి. అలాగే ఎముకల దృఢత్వాన్ని పెంచడంలోనూ నువ్వులు సహాయం చేస్తాయి. వీటిని రోజూ తింటుంటే శరీర మెటబాలిజం, రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
News February 14, 2026
అమర జవాన్లు.. ఈ ఫొటోను లైక్ చేయాల్సిందే!

పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటికి ఏడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశం యావత్తు ఆ అమరవీరులకు నివాళులర్పిస్తోంది. 2019లో జరిగిన ఈ భీకర దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. నటి ఆదా శర్మ ఈ వీరులందరి చిత్రాలతో కూడిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘అవర్ బ్రేవ్ హీరోస్’ అని కొనియాడారు. జవాన్ల త్యాగాల వల్లే మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. *జై జవాన్.. జై హింద్


