News September 5, 2025
పెరిగిన బిజినెస్.. GHMCకి భారీ ఆదాయం

మహానగరంలో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. ఇళ్లు, స్థలాలు ఈ సంవత్సరం అధికంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో భవన నిర్మాణ అనుమతుల ద్వారా GHMCకి కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తోంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు GHMCకి రూ.399 కోట్ల ఆదాయం రాగా.. ఈ సంవత్సరం అవే నెలలకు సంబంధించి రూ.759.98 కోట్లు వచ్చింది. అంటే దాదాపు డబుల్ ప్రాఫిట్ వచ్చిందన్నమాట. స్థిరాస్తి వ్యాపారం పెరుగుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
Similar News
News September 5, 2025
సికింద్రాబాద్ PG కాలేజీలో బోధించేందకు ఛాన్స్

ఓయూ పరిధిలోని సికింద్రాబాద్ పీజీ కాలేజీలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో బోధించుటకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.గంగాధర్ తెలిపారు. కాలేజీలోని హిందీ, ఇంగ్లిష్, గణితశాస్త్రం, స్టాటిస్టిక్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులను బోధించుటకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
News September 5, 2025
HYD: కోర్టు హాల్‌లో దురుసు ప్రవర్తన.. హై కోర్ట్ ఆగ్రహం

కోర్టు హాల్‌లో దురుసుగా ప్రవర్తించిన పిటిషనర్‌పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సివిల్ సూట్ రివ్యూ పిటిషన్‌పై తీర్పు ఎందుకు ఇవ్వరంటు జడ్జితో పిటిషనర్ దురుసుగా ప్రవర్తించాడు. పిటిషనర్ చెన్నకృష్ణారెడ్డి సీనియర్ సిటిజన్ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేసి కేసు నుంచి జడ్జి జస్టిస్ నగేశ్ తప్పుకున్నారు. సీజే బెంచ్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని కోర్ట్ ఆదేశించింది.
News September 5, 2025
HYD: నేడు, రేపు WINES బంద్

రేపు గణపతి నిమజ్జనాల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్& రెస్టారెంట్లు ఇవాళ సా.6 నుంచి రేపు సా.6 గంటల వరకు మూసేయాలని CP సుధీర్ బాబు తెలిపారు. సైబరాబాద్ పరిధిలో వైన్సు, బార్‌లు, కల్లుకాంపౌండ్‌లు బార్& రెస్టారెంట్లు రేపు ఉ.6 గం. నుంచి ఆదివారం ఉ.6 గం.కు బంద్ చేయాలని సీపీ అవినాష్ మహంతి తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.