News August 30, 2025

పెరుగుతున్న గోదావరి..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

image

భద్రాచలం వద్ద గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. నదిలో నీటిమట్టం పెరుగుతుండటంతో కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను అప్రమత్తం చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాలువలు దాటడం, చేపల వేటకు వెళ్లడం వంటివి చేయవద్దని సూచించారు. రెండవ ప్రమాద హెచ్చరికకు ముందు ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Similar News

News August 30, 2025

నా హత్యకు కుట్ర పన్నింది ఎవరో తేల్చాలి: కోటంరెడ్డి

image

AP: తన హత్యకు కుట్ర పన్నారు అన్న వార్తలపై నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి <<17554192>>శ్రీధర్ రెడ్డి<<>> స్పందించారు. ‘నన్ను చంపితే రూ.కోట్లు ఇస్తానని ఎవరు చెప్పారో పోలీసులు తేల్చాలి. YCP నేతలు, రౌడీ షీటర్ల బుడ్డ బెదిరింపులను నేను కాదు కదా.. నా మనవడు, నా మనవరాలు కూడా లెక్క చేయరు. ప్రతి మనిషికి ఏదో రోజు మరణం వస్తుంది. భయపడుతూ బతికే అలవాటు నాకు లేదు’ అని తెలిపారు.

News August 30, 2025

జగదేవ్‌పూర్: పంచాయతీ కార్యదర్శి సస్పెండ్: కలెక్టర్

image

జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శైలేష్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హైమావతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో ఇద్దరు డెంగ్యూతో మరణించిన నేపథ్యంలో ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందున కార్యదర్శిని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

News August 30, 2025

పోలీసుల వైఫల్యం లేదు: కోటంరెడ్డి

image

ప్రాణమంటే ఎవరికైనా తీపేనని.. తనను తాను ఎలా కాపాడుకోవాలో తెలుసని నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి చెప్పారు. ‘మంత్రివర్గ విస్తరణలో నా పేరు ఉందనే వివాదాలు చుట్టుముట్టాయని అంటున్నారు. నేను మూడోసారి గెలిచి 14 నెలలు అవుతోంది. అందరికీ మంచే చేశాను. ఏ వివాదాల జోలికి నేను వెళ్లలేదు. పోలీసుల వైఫల్యం లేదు. వీడియో గురించి ఎస్పీకి తెలిసిన వెంటనే నాకు చెప్పలేదనే చిన్న అసంతృప్తి మాత్రం ఉంది’ అని కోటంరెడ్డి అన్నారు.