News March 4, 2025
పెళ్లికి వెళ్లొస్తుండగా ముగ్గురు దుర్మరణం

మహాముత్తారం మండలం మినాజీపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పింగిలి రాజిరెడ్డి అలియాస్ లడ్డు, పింగిలి రవీందర్ రెడ్డి కలిసి మల్హర్ మండలం అన్సాన్పల్లిలో జరిగిన వివాహానికి హాజరయ్యారు. తిరిగి వస్తున్నక్రమంలో భూపాలపల్లి మండలం రాంపూర్ శివారులో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వారిద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పంబాపూర్‌కు చెందిన సతీశ్ మృతిచెందిన విషయం తెలిసిందే.
Similar News
News November 7, 2025
ASPగా నంద్యాల జిల్లా యువతి

మహానంది మండలం నందిపల్లెకు చెందిన వంగల మనీషా రెడ్డి మన్యం జిల్లా పార్వతీపురం ఏఎస్పీగా గురువారం బాధ్యతలు చేపట్టారు. గ్రేహౌండ్స్ విభాగంలో అసాల్ట్ కమాండర్‌గా ఉన్న మనీషా రెడ్డిని ఇటీవల ఉన్నతాధికారులు పార్వతీపురం ఏఎస్పీగా నియమించారు. ఈ మేరకు తల్లిదండ్రులు పార్వతీపురం చేరుకుని తమ కుమార్తెను అభినందించారు. గ్రామస్థులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 7, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు!

ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA పేర్కొంది. కోనసీమ, ప.గో, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. అటు తెలంగాణలో ఉ.8.30 గంటల వరకు అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కురిసేందుకు స్వల్ప అవకాశముందని HYD IMD పేర్కొంది. తర్వాతి 6 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని తెలిపింది.
News November 7, 2025
ఒక పూట భోజనం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

హిందూ ధర్మంలో కొందరు కొన్ని వారాల్లో ఒక పూట భోజనం చేసే వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ వ్రతం వెనుక కొన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోజూ ఒకపూటే తినడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.శరీరానికి విశ్రాంతి దొరికి, జీర్ణవ్యవస్థపై భారం తగ్గుతుంది. ఫలితంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆయుష్షు, శక్తి పెరుగుతాయి. ఎక్కువ పూటలు తినడం అనారోగ్యానికి సంకేతం. అందుకే పరిపూర్ణ ఆరోగ్యం కోసం ఈ నియమాన్ని పాటించాలంటారు. <<-se>>#Aaharam<<>>


