News January 26, 2025

పేకాట స్థావరంపై దాడి.. ఇద్దరు అరెస్ట్

image

ద్వారకాతిరుమల మండలం, లైన్ గోపాలపురంలోని ఓ తోటలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ద్వారకాతిరుమల ఎస్‌ఐ టి.సుధీర్ సిబ్బందితో కలిసి శనివారం దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 20,500 ల నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. పేకాట, కోడిపందేలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని ఎస్‌ఐ హెచ్చరించారు.

Similar News

News February 26, 2026

మహబూబాబాద్ కలెక్టర్ బదిలీ

image

మహబూబాబాద్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ అయ్యారు. 2013 బ్యాచ్‌కు చెందిన కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జనవరి 2, 2024న మహబూబాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. నిబద్ధతతో జిల్లాలో పనిచేశారు. ఆయన తెలంగాణ భవన్ స్పెషల్ సెక్రెటరీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కలెక్టర్‌గా నియమకమయ్యారు.

News February 26, 2026

127KGల గోల్డ్ స్కామ్.. నటి రన్యారావుకు షాక్

image

బంగారం స్మగ్లింగ్ కేసులో దాదాపు ఏడాదిగా జైలులో ఉన్న కన్నడ నటి <<15969980>>రన్యారావుకు<<>> మరో షాక్ తగిలింది. తాజాగా ED బెంగళూరులోని PMLA కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ఆమె పేరును ప్రస్తావించింది. రూ.102 కోట్ల విలువైన 127 కేజీల బంగారాన్ని రన్యారావు సిండికేట్ ముఠా దుబాయ్ నుంచి INDకు అక్రమంగా తరలించినట్లు తెలిపింది. కాగా గతేడాది మార్చి 3న 14.2 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ నటి దొరికిపోయిన విషయం తెలిసిందే.

News February 26, 2026

తిరుమలలో నేటి నుంచి తెప్పోత్సవాలు

image

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అవుతాయి. మార్చి 2వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామివారు దర్శనమిస్తారు. మొదటి రోజు శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు శ్రీకృష్ణస్వామి, చివరి 3 రోజులు మలయప్పస్వామి వారు తెప్పలపై విహరిస్తారు. ఈ వేడుకల కారణంగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు కొన్ని ప్రత్యేక సేవలను TTD రద్దు చేసింది.