News March 3, 2025

పేకాట స్థావరంపై దాడి.. 17 మంది అరెస్టు

image

హిందూపురం మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలోని కొండ ప్రాంతాల్లో జరుగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. డీఎస్పీ మహేశ్ ఆధ్వర్యంలో సీఐ చంద్ర ఆంజనేయులు తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు. 17 మందిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి 10 బైకులు, రూ.81 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాటను అశ్వత్థప్ప అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Similar News

News February 22, 2026

ఖమ్మం: టెన్త్‌ మెమోలో తప్పులా? సవరణకు రెండు రోజుల గడువు

image

పదో తరగతి నామినల్ రోల్స్‌లో దొర్లిన తప్పుల సవరణకు పరీక్షల విభాగం తుది అవకాశం కల్పించింది. విద్యార్థుల పేరు, పుట్టిన తేదీల్లో చిన్న పొరపాటు ఉన్నా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలోని 32 వేల మంది విద్యార్థులు తమ వివరాలను వెబ్‌సైట్‌లో సరిచూసుకోవాలని సూచించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పరీక్షల దృష్ట్యా, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News February 22, 2026

మంచిర్యాల: ఉద్యోగం రావట్లేదని నిరుద్యోగి సూసైడ్

image

ఉద్యోగం రావట్లేదని, అమ్మకు భారం కావద్దని ఓ నిరుద్యోగి ఈనెల 19న గడ్డి మందు తాగిన ఘటన చెన్నూర్‌లో జరిగింది. పట్టణంలోని కోటబొగూడ కాలనీకి చెందిన కిరణ్ డిగ్రీ పూర్తి చేసి HYDలో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. గ్రూప్- 2, 3, 4 పరీక్షలు రాసినా రాలేదు. చిన్నప్పుడు తన కుటుంబాన్ని నాన్న వదిలేయడం, అమ్మ పడుతున్న కష్టాన్ని చూడలేక వేదన చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.

News February 22, 2026

బెంగుళూరు వెళ్లే రైలు ప్రయాణికులకు శుభవార్త

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా దానాపూర్(DNR), SMVT బెంగుళూరు(SMVB) మధ్య నడిచే డైలీ స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నెం.03251 DNR- SMVB మధ్య నడిచే రైలును మార్చి 5- 31 వరకు, నెం.03252 SMVB- DNR మధ్య నడిచే రైలును మార్చి 7- ఏప్రిల్ 2 వరకు ప్రతి రోజు నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు ఒంగోలు, గూడూరు స్టేషన్లలో మాత్రమే ఆగుతాయన్నారు.