News March 4, 2025

పేదరిక జిల్లాగా ఉమ్మడి అనంతపురం

image

సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోనే అత్యంత పేద జిల్లాల లిస్ట్‌లో అనంతపురం జిల్లా 6వ స్థానంలో ఉంది. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిన్న సోషియో ఎకనామిక్ సర్వే ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సర్వే ప్రకారం గిరిజనులు నివసించే అన్ని ప్రాంతాల్లో పేదరికం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. కాగా అత్యంత పేదరిక జిల్లాగా మొదటి స్థానంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నిలిచింది.

Similar News

News September 16, 2025

వివిధ సంస్థలు- వ్యవస్థాపకులు

image

* మైక్రోసాఫ్ట్- బిల్‌గేట్స్, పాల్ అలెన్
*యాపిల్-స్టీవ్‌జాబ్స్, వోజ్నియాక్, రోనాల్డ్ వెయిన్
*యాహూ -జెర్రీ యాంగ్, డేవిడ్ ఫిలో
*గూగుల్ -లారీపేజ్, సెర్గీబ్రిన్
*లింక్‌డ్ ఇన్- రోడ్ హాఫ్‌మన్, ఎరిక్‌లీ, అలెన్ బ్లూ
*ఫేస్‌బుక్- మార్క్ జుకర్‌బర్గ్
*యూట్యూబ్- చాడ్ హర్లీ, స్టీవ్‌చెన్, జావెద్ కరీం
*ట్విటర్-జాక్ డార్సీ, నోగ్లాస్, బిజ్‌స్టోన్, ఇవాన్ విలియమ్స్
*వాట్సాప్- జాన్ కౌమ్, ఆక్టన్

News September 16, 2025

గుంటూరు: మెగా డీఎస్సీ అభ్యర్థుల తుది జాబితా విడుదల

image

మెగా డీఎస్సీకి సంబంధించి తుది ఎంపిక జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1140 మంది అభ్యర్థులను విద్యాశాఖ ఎంపిక చేసింది. రిజర్వేషన్ల కారణంగా ఖాళీగా మిగిలిన 19 పోస్టులను తర్వాత భర్తీ చేస్తారు. ఈనెల 19న అమరావతిలో జరిగే కార్యక్రమంలో ఎంపికైన వారికి నియామకపత్రాలు అందిస్తారు. శిక్షణ తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించి పాఠశాలలు కేటాయిస్తామని అధికారులు తెలిపారు.

News September 16, 2025

ఉమ్మడి విశాఖలో 1134 పోస్టులు భర్తీ

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో 1,134 DSC పోస్టులు భర్తీ అయినట్లు DEO ప్రేమ్ కుమార్ తెలిపారు. మొత్తం 1139 పోస్టులు విడుదల చేయగా.. 5 ఉర్దూ పోస్టులకు అభ్యర్థులు లేరన్నారు. అభ్యర్థులకు ఈనెల 19న అమరావతిలో సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు ఉంటాయి. అభ్యర్థులు 18న అమరావతి వెళ్లేందుకు విశాఖ విమల స్కూల్ నుంచి ఉదయం 7.30 గంటలకు బస్సులు బయలుదేరుతాయని తెలిపారు.