News December 22, 2025
పేదరిక రహిత జిల్లాగా ఎన్టీఆర్: MP చిన్ని

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్&బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి విశిష్ట సేవా పురస్కారాలు-2025 కార్యక్రమంలో MP కేశినేని చిన్ని, MLA గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విశిష్ట సేవా పురస్కారాలు ప్రముఖులకు అందజేశారు. NTR జిల్లాను పేదరికం లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు P-4 కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు.
Similar News
News February 11, 2026
అమలాపురం: అధికారులను అభినందించిన కలెక్టర్

సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు జిల్లా అధికారులను కలెక్టర్ మహేష్ కుమార్ అభినందించారు. అధికారులతో ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సమావేశం నిర్వహించి ఉత్సవాల నిర్వహణలో లోటుపాట్ల గురించి చర్చించారు. భవిష్యత్తులో ఉత్సవాల నిర్వహణ సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
News February 11, 2026
పన్నుల వసూల్లో అధికారులు కీలకపాత్ర పోషించాలి: కలెక్టర్

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జీఎస్టీ, వాణిజ్య పన్నుల వసూళ్లకు సంబంధించి కీలక కార్యాచరణ అమలు చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని సమకూర్చడంలో అధికారులకు కీలకపాత్ర పోషించాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో అధికారులతో బుధవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వాణిజ్య, జీఎస్టీ పన్నులకు సహాయపడేలా ప్రతి శాఖకు వాణిజ్య పన్నుల శాఖ వారు ఒక ఫార్మేట్ రూపొందించాలన్నారు.
News February 11, 2026
లోక్‌సభలో రగడ.. అసలు రాహుల్ ఏమన్నారంటే?

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రస్తావన తేవడం రాజకీయ దుమారం రేపింది. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేరున్న పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అసలు ఎప్‌స్టీన్‌కు అనిల్‌ను పరిచయం చేసిందెవరో కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురికి తెలుసు’ అని రాహుల్ వ్యాఖ్యానించడంతో బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది.


