News March 12, 2025
పేదలందరికీ ఇళ్ళు ఏర్పాటు దిశగా చర్యలు: కలెక్టర్

పేదలందరికీ ఇళ్ళు ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ప.గో జిల్లాలో 18,340 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల గృహాల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. బీసీలులు 12,362, ఎస్సీలు 5,593, ఎస్టీలు 385 లబ్దిదారులు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటికి అదనంగా రూ.92.66 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
Similar News
News March 12, 2025
భీమవరం పట్టణంలో బాంబు బెదిరింపు కలకలం

భీమవరం పట్టణంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీలోని డెంటల్ కళాశాలకు బుధవారం మధ్యాహ్నం మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీనితో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కాలేజ్ యాజమాన్యం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహిస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 12, 2025
హైదరాబాద్‌లో పోడూరు యువకుడు మృతి

పోడూరుకి చెందిన రోహిత్ అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన విదితమే. రోహిత్ తల్లి బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లారు. సమాచారం తెలియడంతో ఆమె స్వగ్రామానికి బయలుదేరారు. ఇటీవల భర్త మరణించగా ఆ బాధ నుంచి తెరుకోక ముందే కొడుకు మృతితో ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని బంధువులు తెలిపారు. మృతదేహన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
News March 12, 2025
హైదర్‌బాద్‌లో ఉరిసేకున్న ప.గో జిల్లా యువకుడు

ప్రేమ విపలం అవ్వడంతో ప.గో జిల్లాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. పోడూరుకు చెందిన రోహిత్ కూమార్ ఓల్డ్ హఫీజ్ పేటలో స్నేహితులో కలిసి ప్రెవేట్ ఉద్యోగం చేస్తు జీవిస్తున్నాడు. మంగళవారం కలతగా ఉండటంతో ట్యాబెలెట్స్ వేసుకుని పడుకున్నాని చెప్పాడు. స్నేహితులు విధులు ముగించుకుని తిరిగి వచ్చి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.