News August 15, 2025

పేదలకు 300 ఎకరాలు ఇచ్చిన మహానీయుడు

image

స్వాతంత్య్ర పోరాటంలో బాపట్లకు చెందిన రావూరి శ్రీశైలపతికి ప్రత్యేక స్థానం ఉంది. 1886 జనవరి 14న ఆయన జన్మించారు. మురుకుండపాడు కరణంగా పని చేస్తూ, గాంధీ పిలుపుతో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. బ్రిటిషు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో 1922లో పదవికి రాజీనామా చేశారు. పర్చూరు మండలం చెరుకూరులో తనకు చెందిన 300 ఎకరాల భూమిని నిరుపేదలకు పంపిణీ చేశారు. యావదాస్తిని స్వాతంత్య్ర పోరాటానికి కేటాయించారు.

Similar News

News August 15, 2025

సబ్బవరం: మహిళ మెడకు టవల్ బిగించి హత్య?

image

సబ్బవరం మండలం బాటజంగాలపాలెం పరిధిలో పాక్షికంగా కాలిపోయి ఉన్న గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను వేరే ప్రాంతంలో హత్య చేసి ఇక్కడికి తీసుకువచ్చి తగలబెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు గర్భవతి అని పోలీసులు తెలిపారు. 13వ తేదీ రాత్రి మెడకు టవల్ బిగించి హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎస్సీ తుహీన్ సిన్హా సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.

News August 15, 2025

ఏటికొప్పాక లక్క బొమ్మల కళాకారుడి ప్రతిభ

image

ఏటికొప్పాక లక్క బొమ్మల కళాకారుడు గుత్తి వాసు అంకుడు కర్ర, లక్కను ఉపయోగించి జాతీయ జెండాను తయారుచేసి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను రూపొందించి భక్తి భావాన్ని చాటుకున్నాడు. ఇప్పటివరకు ఏటికొప్పాక కళాకారులు జాతీయ జెండాను తయారు చేయలేదని వాసు తెలిపారు. దీనిని రూపొందించేందుకు ఆరు రోజులు సమయం పట్టిందన్నారు. దీని పొడుగు 38 సె.మీ.కాగా, వెడల్పు 28 సె.మీ. ఉంది.

News August 15, 2025

ఎస్.కోట: తలపై రాయిపడి బాలుడు మృతి

image

కాలకృత్యాలకు వెళ్లిన బాలుడు తలపై రాయిపడి మృతి చెందిన సంఘటన ఎస్.కోటలోని ఆకుల డిపో సమీపంలో చోటు చేసుకుంది. గురువారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమీన్ ఖాన్ (17) ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. నిర్మాణంలో ఉన్న ఓభవనం పక్కన కాలకృత్యాలు కోసం వెళ్లాడు. అదే సమయంలో భవనం పైనుంచి నిర్మాణ కార్మికుడు రాయి కిందికి పడేయడంతో అది అమీన్ తలపై పడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.