News January 2, 2026
పేదల కోసం నిలబడకుండా వెళ్లిపోయారు: భట్టి

TG: ఉపాధి హామీ పథకంపై సభలో మాట్లాడకుండా BRS నేతలు వెళ్లిపోవడం విచారకరమని Dy.CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ‘కోట్లాది మంది నిరుపేదల కోసం BRS అలియాస్ TRS నేతలు మాట్లాడాల్సింది. కానీ, వాళ్లు వారి స్వార్థ ప్రయోజనాల కోసం పేదలను వదిలేశారు. ఈ చట్టాన్ని మార్చకూడదని, పాతదే కొనసాగించాలని చాలా రాష్ట్రాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. మనమూ అలాంటి తీర్మానం చేసి పేదల పక్షాన నిలబడదాం’ అని విజ్ఞప్తి చేశారు.
Similar News
News January 7, 2026
నిమ్మలో పూత, పిందె రాలకుండా ఉండాలంటే..

నిమ్మ చెట్లకు నీటి తడులలో ఒడిదుడుకులు, ఎక్కువ రోజుల పాటు నీటిని ఇవ్వకుండా ఒక్కసారిగా ఎక్కువ నీటిని ఇవ్వడం, చెట్టులో హార్మోనల్ స్థాయిల్లో మార్పులు, వాతావరణ మార్పుల వల్ల నిమ్మలో పూత, పిందె రాలే సమస్య తలెత్తుతుంది. దీని నివారణకు 200 లీటర్ల నీటికి 45-50ml ప్లానోఫిక్స్ మందును కలిపి పూత పూసే సమయంలో ఒకసారి, పిందె దశలో మరోసారి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News January 7, 2026
భర్త ప్రొడక్షన్‌లో సమంత సినిమా.. లుక్ రిలీజ్

రెండో పెళ్లి తర్వాత సమంత సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. భర్త రాజ్ నిడిమోరు నిర్మాతగా, నందినీ రెడ్డి దర్శకత్వంలో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్ ఖరారు చేశారు. సామ్ లుక్ పోస్టర్‌ను ఇవాళ విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా JAN 9న టీజర్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ మూవీకి భర్త రాజ్‌తో పాటు సమంత కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
News January 7, 2026
సంక్రాంతి-2026 విన్నర్ ఎవరో?

సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుంటాయి. ఈసారి కూడా పెద్ద, చిన్న హీరోలందరూ పొంగల్ బరిలో నిలిచారు. ప్రభాస్ ‘రాజాసాబ్’, మెగాస్టార్ చిరంజీవి ‘MSVG’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ విన్నర్‌గా నిలిచింది. మీరు ఏ మూవీకి వెళ్తారు? COMMENT


