News April 8, 2025

పేదల గృహాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో పేదల గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి సోమవారం ఆమె మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మే 31వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా 8,839 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు.

Similar News

News April 17, 2025

ప్రకాశం: జిల్లాకు 124 SGT, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు

image

స్పెషల్ బీఈడీ చేసిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వం మొదటిసారిగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్పెషల్ బీఈడీ కోర్సులు చేసిన అభ్యర్థులను టీచర్లుగా నియమించనుంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 124 SGT, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. వీటిని మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లుగా అధికారులు వెల్లడించారు.

News April 17, 2025

ఒంగోలు: 14 మంది ప్రభుత్వ వైద్యులకు షోకాజ్ నోటీసులు

image

ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రభుత్వ వైద్యశాలల్లో విధులు నిర్వహిస్తున్న 14 మంది ప్రభుత్వ వైద్యులు ఫేషియల్ యాప్ ద్వారా టాంపరింగ్ చేసి అడ్డంగా బుక్కయ్యారు. ఐఫోన్ ద్వారా చిన్నపాటి టెక్నాలజీని ఉపయోగించి ఫేషియల్ యాప్‌ను వినియోగించిన వైద్యులకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఈ టాంపరింగ్‌లో భారీ ఎత్తున వైద్య సిబ్బంది కూడా ఉన్నట్లుగా అధికారులు గుర్తిస్తున్నారు.

News April 17, 2025

త్రిపురాంతకం: ఇరువర్గాల ఘర్షణ

image

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని మిట్టపాలెంలో బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో 11 మందికి గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను 108, ఇతర వాహనాలలో యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బెల్ట్ షాప్ నిర్వహణ విషయం మీద వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!