News March 10, 2025
పేదల జీవన ప్రమాణాలు మెరుగు కోసం పీ4 సర్వే: జేసీ

పేదల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి పి4 సర్వే ఎంతగానో దోహదపడుతుందని జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. బాపట్ల కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం (P4)తో ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి అనే వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తుందన్నారు.
Similar News
News March 10, 2025
ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలని రామ్మోహన్ లేఖ

AP: శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్, రెండు ఫిషింగ్ జెట్టీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్‌కు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు లేఖ రాశారు. తన నియోజకవర్గం శ్రీకాకుళంలో 197కి.మీ సముద్ర తీర ప్రాంతం ఉందని, 230కి పైగా గ్రామాల ప్రజలు మత్స్య సంపదపైనే ఆధారపడి ఉన్నారని వివరించారు. సంతబొమ్మాళి(మ) భావనపాడు గ్రామం వద్ద ఫిషింగ్ పోర్ట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
News March 10, 2025
NZB: అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం: సీపీ

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని నూతన సీపీ సాయి చైతన్య స్పష్టం చేశారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, గంజాయి, మట్కా నియంత్రణకు కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
News March 10, 2025
శ్రీకాకుళం: ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలి: రామ్మోహన్

శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్, రెండు జెట్టీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శర్బానంద్ సోనోవాల్‌కు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం లేఖ రాశారు. శ్రీకాకుళంలో 197 కి.మీ సముద్ర తీరం ఉండి, 230కి పైగా గ్రామాల ప్రజలు మత్య్స సంపదపై ఆధార పడి జీవిస్తున్నారన్నారు. సంతబొమ్మాళి మండలం భావనపాడు గ్రామంలో మత్య్స నౌకాశ్రమం ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.